హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా కంది తిరుపతి రెడ్డి

హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా కంది తిరుపతి రెడ్డి

హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా కంది తిరుపతి రెడ్డి

వైస్ చైర్మన్ గా హుస్నాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బంక చందు

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ చైర్మన్ గా చిగురు మామిడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన కంది తిరుపతి రెడ్డి వైస్ చైర్మన్ గా హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ మండల అధ్యక్షుడు బంక చందు ఎన్నికైనట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కంది తిరుపతిరెడ్డి చిగురుమామిడి మండలంలో, బంక చందు హుస్నాబాద్ మండలంలో మండల అధ్యక్షులుగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ గెలుపులో ప్రముఖ పాత్ర వహించారు. కంది తిరుపతిరెడ్డి సుందరగిరి వార్డు మెంబర్ గా, వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా చిగురు మామిడి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడుగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో అనుభవం ఉన్న నాయకుడిగా మండలంలో మంచి గుర్తింపు ఉంది. అంతేకాకుండా 35 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఎనలేని అభిమానాన్ని సాధించుకున్నారు. అలాగే బంక చందు కూడా హుస్నాబాద్ మండల అధ్యక్షుడిగా ఉంటూ యువ నాయకుడిగా పేరు సాధించాడు. మండలంలో జరిగే ప్రతి కార్యక్రమంలో చురుకైన పాత్ర పోషిస్తూ పేరెన్నికగన్నారు.

తమ ఎన్నిక పట్ల ఇరువురు హర్షం వ్యక్తం చేస్తూ రైతులకు తాము పండించిన పంటకు మద్దతు ధర లభించే విధంగా న్యాయం జరిగే విధంగా చూస్తామని పేర్కొన్నారు. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులుగా బోడిగే పరుశరాములు, పత్తిపాక తిరుపతి, ఓరుగంటి భారతి, పోతుగంటి బాలయ్య, మహమ్మద్ కుతుబుద్దిన్, బొంగోని శ్రీనివాస్, లావుడియా బిక్య, మడప యాదవ రెడ్డి, కరంటోతూ రవి, బైకాని శ్రీనివాస్, తీరాల మారుతి, తణుకు ఆంజనేయులు, ఎల్ ఎస్ సీ ఎస్ చైర్మన్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి, వ్యవసాయ శాఖ ఏడిఏ, హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్లు సభ్యులుగా ఉన్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *