రేపు హుస్నాబాద్‌లో కీ.శే. కర్ర శ్రీహరి సంతాప సభ

రేపు హుస్నాబాద్‌లో కీ.శే. కర్ర శ్రీహరి సంతాప సభ

రేపు హుస్నాబాద్‌లో కీ.శే. కర్ర శ్రీహరి సంతాప సభ, అన్నదాన కార్యక్రమం

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:


హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన ప్రజా నాయకులు, సీనియర్ రాజకీయవేత్త కీ.శే. కర్ర శ్రీహరి స్మారకార్థంగా సోమవారం (22-09-2025) హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సంతాప సభ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాన్ని కీ.శే. కర్ర శ్రీహరి అభిమానులు, ఆత్మీయులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. ప్రజా నాయకులు, సీనియర్ రాజకీయవేత్తలు పాల్గొని ఆయనను స్మరించనున్నారు. అనంతరం స్థానిక ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అభిమానులు, ఆత్మీయులు అందరినీ నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు అయిలేని మల్లికార్జున రెడ్డి, ఎగ్గిడి ఐలయ్య, అక్కు శ్రీనివాస్, మెదిని వెంకట్ స్వామి, కురిమెల్లి శ్రీనివాస్, వెంకట్ నారాయణ, బద్దిపడిగే రాజీ రెడ్డి, మేకల వికాస్ యాదవ్, పాకాల శ్యామ్ సుందర్, కోమ్మర నర్సింహా రెడ్డి.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *