కోరిన కోర్కెలు తీర్చే అమ్మ వారిని దర్శించుకోవడం సంతోషంగా వుంది
రేణుక ఎల్లమ్మ ఆలయం అభివృద్ధికి నోచుకోకపోవడం బాధాకరం
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ పట్టణంలో శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మ వారిని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ రేణుక ఎల్లమ్మ అమ్మ వారిని దర్శించుకోవడం సంతోషంగా వుందని, అమ్మ వారి ఆశీర్వాదంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని,పాడి పంటలతో వర్ధిల్లాలని అన్నారు, స్థానికేతరుల పాలన లో ఎల్లమ్మ ఆలయం అభివృద్ధికి నోచుకోలేదని,హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఒకటైన రేణుక ఎల్లమ్మ దేవాలయంలో కనీస సౌకర్యాలు లేకపోవడం బాధాకరం అని రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ తరుపున నిధులు మంజూరు కి కృషి చేసి ఆలయ అభివృద్ధికి తోడ్పడతామని, తన వంతుగా సహాయ సహకారాలు అంద చేస్తానని అన్నారు. తరువాత పట్టణంలోని అరేపల్లిలో బీరప్ప కామరాతి అక్క మహంకాళి కళ్యాణ మహోత్సవ ఉత్సవాల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. వీరి వెంట బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
