రాష్ట్రంలో బీజేపీ సభ్యత్వ నమోదులో రెండవ స్థానంలో JSR
సత్కరించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
కరీంనగర్ మహాశక్తి ఆలయంలో శనివారం సాయంత్రం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి (JSR) మర్వాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీజేపీ సభ్యత్వ నమోదు లో తెలంగాణలో JSR 4000 (నాలుగు వేలకు పైగా) పై చిలుకు సభ్యుత్వాలతో రెండవ స్థానంలో ఉండటం పట్ల వారికి శుభాకాంక్షలు తెలిపి, శాలువా తో సత్కరించి, హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ ని ప్రజల్లోకి తీసుకెళ్ళి సభ్యత్వ నమోదులో మొదటి స్థానంలో సురేందర్ రెడ్డి నిలవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా JSR మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తల సహకారంతో బీజేపీ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలవగలిగానని మొదటి స్థానంలో నిలిపేందుకు మీ యొక్క సహాయ సహకారాలు ఇలాగే కొనసాగిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటు సభ్యత్వ నమోదు కోసం కష్టపడి పనిచేస్తున్న ప్రతి కార్యకర్తను పార్టీ గుండెలో పెట్టుకొని చూసుకొంటుందని బూత్ కు 200 లక్ష్యాన్ని పూర్తిచేయాలని తెలిపారు.