మోహన్ బాబును అరెస్టు చేయాలని జర్నలిస్టుల నిరసన
మద్దతు తెలిపిన అఖిలపక్ష నాయకులు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సినీనటుడు మోహన్ బాబు కుటుంబ గోడవల నేపథ్యంలో టీవీ 9 జర్నలిస్టు మరియు ప్రతినిధి మోహన్ బాబును వివరణ అడుగుతున్న సందర్భంలో టీవీ 9 లోగోను విసిరి, లోగో వైర్ తో జర్నలిస్టుపై దాడి చేయడం జరిగింది. దాడిని ఖండిస్తూ బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు మరియు టీవీ 9 జర్నలిస్టు పూదరి రమేష్ ఆధ్వర్యంలో నిరసన తెలుపగా, అఖిలపక్ష నాయకులు మద్దతు తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకంగా ఉంటుందని, ప్రతి సమస్యను ప్రజలకు తేలియజేసే క్రమంలో సినీ రంగంలో ప్రముఖంగా ఉన్న మోహన్ బాబు మీడియాపై దాడి చేయడం ఆయన అహంకారంనికి నిదర్శనం, సిగ్గు చేటని అన్నారు. ఈ దాడిని అఖిలపక్ష నాయకులు తీవ్రంగా ఖండిస్తూ, నటుడు మోహన్ బాబును అరెస్టు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కేడం లింగమూర్తి, కంది తిరుపతిరెడ్డి, బంక చందు, అక్కు శ్రీనివాస్, ఆకుల వెంకన్న, మల్లికార్జున్ రెడ్డి, చిత్తారి పద్మారవీందర్, అన్వర్ పాషా, భూక్య సరోజన, సుద్దాల చంద్రయ్య, కవ్వ వేణుగోపాల్ రెడ్డి, బత్తుల శంకర్ బాబు అఖిలపక్ష నాయకులు జర్నలిస్టులు పాల్గొన్నారు.