నేడు 50,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్!
సిద్దిపేట టైమ్స్ డెస్క్ :
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటినుంచి ప్రారంభం కానున్న ఈ నేపథ్యలో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను ప్రకటించనుంది. దాదాపు 50వేల పోస్టులతో ఈ క్యాలెండర్ ఉంటుందని అంచనా. ‘ప్రతి సంవత్సరం మార్చి 31 లోపు అన్ని శాఖల్లో ఏర్పడిన ఖాళీలను గుర్తిస్తాం. జూన్ 2 నాటికి నోటిఫికేషన్ ఇస్తాం. ఎంపికైన అభ్యర్థుల చేతుల్లో డిసెంబర్ 9లోపు నియామక పత్రాలను పెట్టాలన్నదే మా ప్రభుత్వ ధ్యేయం’ అని సీఎం రేవంత్ గతంలో చెప్పిన విషియం తెలిసిందే.