జీవో నెం.25 ను వెంటనే రద్దు చేయాలి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
ప్రాథమిక పాఠశాలల మనగడకు తీవ్ర విఘాతం కల్పించేలా ఉన్న జీవో నెంబర్ 25 రద్దుకై రాష్ట్రవ్యాప్తంగా SGTU రాష్ట్ర శాఖ నిరసన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం అక్కన్నపేట మండల SGT లు ప్రశస్త్ శిక్షణ కార్యక్రమంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ… ఆశాస్త్రీయం గా ఉపాధ్యాయుల సర్దుబాటు చేసే జీవో నెంబర్ 25 ను తక్షణమే రద్దు చేయాలని, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు, ప్రతి పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయుడు ఉండాలని, SGT లకు ఎమ్మెల్సీ ఓటు హక్కు కల్పించాలని, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అక్కన్నపేట మండలంలోని, మల్లంపల్లి, అక్కన్నపేట, రామవరం, గోవర్ధనగిరి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, SGT ఉపాధ్యాయులు పాల్గొన్నారు.