కంటిచూపు కోల్పోయిన వ్యక్తికి జగ్గారెడ్డి పది లక్షల సాహయం..

సిద్దిపేట టైమ్స్, సంగారెడ్డి, సెప్టెంబర్ 11
కంటి చూపు కోల్పోయిన విద్యార్థికి తిరిగి చూపు వచ్చేందుకు చికిత్స కోసం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి దంపతులు రూ 10లక్షలు రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. సంజారెడ్డి జిల్లా కంది మండలానికి చెందిన సంపురన్ నాయక్ రోడ్డు ప్రమాదంలో కంటి చూపు కోల్పోగా చికిత్స నిమిత్తం పది లక్షల రూపాయలు నాయక్ కు అందజేశారు. చికిత్స విజయవంతంగా పూర్తయి కంటి చూపు రావాలని ఆకాంక్షించారు.
ఇలాంటి పెద రోగుల కోసం సీఎం రేవంత్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లి.. వైద్య సహాయం అందేలా భవిష్యత్ లో చూస్తానన్న జగ్గారెడ్డి హామీ ఇచ్చారు.






