అంబేద్కర్ ని రాజకీయాలకు ముడిపెట్టడం సరి కాదు
– ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
సిద్దిపేట టైమ్స్ అక్బరుపేట/భూంపల్లి
ఇటీవల దౌల్తాబాద్ మండలం ముబారస్పూర్ గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. ఈ సందర్భంగా బుధవారం సోషల్ మీడియా ద్వారా ఆయన మాట్లాడుతూ,విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో ర్యాలీ అనంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే క్రమంలో అంబేద్కర్ కి పూలమాలలు వేసే సందర్భంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేతిలో ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ జెండాను విగ్రహం కింద ఉన్న దళిత వ్యక్తికి అందుకోమని చెప్పి కిందికి ఇవ్వడం తో ఆ వ్యక్తి పట్టుకోనందున జెండా కింద పడటం జరిగింది,ఆ సందర్భాన్ని ఉద్దేశించి పలు రాజకీయ పార్టీలు, పార్టీల నాయకులు రాజకీయాలకు ముడిపెట్టడం సరి కాదని జెండా కిందకు అందజేసే క్రమం లో ప్రత్యక్ష సాక్షిగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ అయినటువంటి నేను పక్కనే ఉన్నానని అలాగే దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్ తో పాటు వివిధ దళిత సంఘం నాయకులు కూడా ఉన్నారని, జెండా ను పడేస్తే మేము అక్కడే ఖండించే వారిమని రాజకీయాల పరంగా విమర్శలు ఉంటే రాజకీయాల మట్టుకే ఉంచాలని,అంబేద్కర్ ని రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదు. ఇంతటి తో ఈ ఘటనలు,విమర్శలు ఆపాలని కోరుతున్నామని తెలిపారు.
Posted inతెలంగాణ
అంబేద్కర్ ని రాజకీయాలకు ముడిపెట్టడం సరి కాదు
