సిద్దిపేట గులాబీ పార్టీలో కుంపటి తప్పదా..! ఆ నేత తీరుపై పార్టీ కౌన్సిలర్లు, కార్యకర్తలు అసహనం.. తీరు మారకపోతే.. పార్టీ పరువు బజారుపాలే..!
సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేట ప్రతినిధి; ఆగస్టు 20
గులాబీ పార్టీకి కంచు కోట అయిన సిద్దిపేటలో సొంత పార్టీ నేతలతో కుంపటి తయారుకానుందా అంటే అవుననే తెలుస్తుంది. ఆ పార్టీలోని సిద్దిపేట కు చెందిన ఓ నేత చేస్తున్న అతి వల్ల పార్టీ పరువు బజారు కేక్కనుంది..! ఆయన నమ్ముకున్న కార్యకర్తలకు వెన్నుపోటు పోడుస్తున్నాడట. నిన్న మొన్న అన్నదమ్ముల్లా కలిసి మేలిసి ఉన్న ఆ పార్టీ నేతలు, కౌన్సిలర్లు ఆయన వ్యవహర తీరుతో గల్లలు పట్టుకునే స్థాయికి చేరుకుంది వ్యవహారం.. ఇదంతా ఆ నాయకుని నిర్వహకం మూలంగా పార్టీ పరువు బజరు పాలు అవ్వనుందని తెలుస్తుంది.. ఆ నేత చేస్తున్న అతి వల్ల ఆ పార్టీకి నేతలే కుంపటిలా మారనున్నారని స్పష్టమవుతోంది. ఇంత కాలం ఆ నేత ఆగడాలు చూస్తూ సహించిన వారే నేడు బహిరంగంగా ఆయన అక్రమ ఆస్తులు.. దందాలను, సంబంధాలను బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
సిద్దిపేట బీఅర్ఎస్ పార్టీ క్రమశిక్షణకు మారు పేరు.. కానీ ఆ క్రమశిక్షణ నేడు క్రమశిక్షణ తప్పుతుంది. సార్ కనుసన్నల్లో సిద్దిపేటను నడిపించే ముఖ్య నేత పై ఆ పార్టీ నేతలు గుస్స అవుతున్నారు. ఆ నేత వ్యవహర శైలి, తీరు పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఆ నాయకుడి ఆక్రమ ఆస్తులు, దందా, సంబంధాలను ఆ పార్టీ నేతలే బట్టబయలు చేసేందుకు అడుగు ముందుకు వేస్తున్నాట్లు సమాచారం. ఇంత కాలం ఆయన చేసే ప్రతి పనికి వత్తాసు పలికిన నేతలే.. ఇప్పుడు ఆయనపై యుద్ధానికి సిద్దం అంటున్నారంటే.. ఆయన ప్రవర్తన తీరు ఏస్థాయిలో ఉందో చెప్పకనే అర్థమవుతోంది. ఇదంతా తెలిసిన బాస్ మాత్రం తనను వేనుకేసుకు రావటం, నిమ్మకుండటం విస్మయాన్ని కల్గిస్తుంది. ఇప్పటికే ఆయన తీరుతో విసుగు చెందిన పలువురు కార్యకర్తలు, కౌన్సిలర్లు బహిరంగంగానే విమర్శించి పార్టీ మారారు. అధికార పార్టీలో చేరిన వారు ఆయన తీరు, ఆయన ఆక్రమ ఆస్తులు, దందాలు, సంబంధాల ను విమర్శిస్తుంటే..
ప్రస్తుతం స్వంత పార్టీలో ఉన్న నేతలు ఆధికారిక సమావేశాల్లో ప్రతిపక్ష నేతల కన్నా ముందే సభలో ప్రశ్నిస్తున్నారు. నిధుల ధుర్వినియోగం, కమిషన్ల దందా పై వివరణ ఇవ్వాలని ప్రశ్నిస్తే దాటవేస్తూ తప్పించుకుంటున్నరని విమర్శిస్తున్నారు.
స్వంత పార్టీ సభ్యలు అడిగే ప్రశ్నలకు సమాధానం చేప్పకుండానే సమావేశాలకు, సభకు ముగింపు పలుకుతున్నారని అంటున్నారు. ప్రతి నెలా ఇదే తంతు కొన సాగుతుంది.. ఇక నుంచి ప్రతి నెలా జరిగే సభలు నిర్వహించకుడదని ఆ అధికారికి హుకుం జారిచేశారట ఆ నేత. అందుకు ఆ అధికారి ఆదేశాలు ఇచ్చేందుకు సిద్దం అవుతున్నారని తెలుస్తుంది. ఇకనుండి ప్రతి నేల నిర్వహించే సభలు నిర్వహిస్తారా..? నిర్వహించకుంటే ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఊరుకుంటారా..? స్వంత పార్టీ సభ్యులే ఊరుకునే పరిస్థితులు కనిపించడం లేదు. ఆ నేత ఆగడాలకు కళ్లేం వేయకుంటే సిద్దిపేట గులాబీ పార్టీకి కుంపటి తప్పదు.. ఇలాగే వేనుకేసుకు వస్తే పార్టీ పరువు బజారులో పడక తప్పదు.. ఆ ఒక్కడి కోసం క్యాడర్ ను వదులు కుంటారా…! లేక క్యాడర్ కోసం ఒక్కడిని పక్కన పెడుతార..? దీని పై బాస్ ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం.





