వైన్స్ దుకాణాలే లక్ష్యంగా రాజకీయ దందా..?అనుమతుల పేరుతో కౌన్సిలర్ల వసూళ్లు.. సిద్దిపేటలో మున్సిపల్ పాలనపై ప్రశ్నలు..

వైన్స్ దుకాణాలే లక్ష్యంగా రాజకీయ దందా..?అనుమతుల పేరుతో కౌన్సిలర్ల వసూళ్లు.. సిద్దిపేటలో మున్సిపల్ పాలనపై ప్రశ్నలు..

వైన్స్ దుకాణాలే లక్ష్యంగా రాజకీయ దందా..?

  • అనుమతుల పేరుతో కౌన్సిలర్ల వసూళ్లు..
  • సిద్దిపేటలో మున్సిపల్ పాలనపై ప్రశ్నలు..

సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట ప్రతినిధి, డిసెంబర్ 28

నూతన వైన్స్ దుకాణాల ఏర్పాటులో రాజకీయ నాయకులు చేతివాటం చూపుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైన్స్ టెండర్లలో వైన్స్ లు దక్కించుకున్న వ్యాపారాలు ఈ నెల 1న (డిసెంబర్) వైన్స్ షాప్ లు ఏర్పాటు చేసుకుని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇది సిద్దిపేట స్థానిక రాజకీయ నేతలకు, మున్సిపల్ కౌన్సిల్లర్లకు డబ్బులు దండుకునేందుకు అవకాశంగా మారింది.. వ్యాపారాలు వైన్స్ షాప్ లు ఏర్పాటు చేసుకోవడానికి పలు అనుమతులు, నిబంధనలు ఉండటం, ఆ అనుమతులు, నిబంధనలు కౌన్సిల్లర్ల, రాజకీయ నేతల వసూళ్ల దందాకు మంచి అవకాశంగా మలుచుకుని దందా కు తెరలేపారు. వైన్స్ షాప్ ఏర్పాటు చేసే చోట స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నారంటూ అక్కడి కౌన్సిలర్లు, రాజకీయ నేతలు వ్యాపారులను బెదిరింపులకు గురి చేస్తూ వసూళ్ల దందాకు తెర లేపారు. ఈ వసూళ్ల దందాకు వార్డు లో కొందరిని కూడ గట్టుకుని మరి వసూళ్లు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణం లో ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న వైన్స్ షాప్ ల యజమానులను సైతం ఇప్పటికి డబ్బులకోసం కౌన్సిలర్లు, రాజకీయ నేతలు వేధిస్తున్నారట. ఇది ఇలా ఉంటే తప్పని పరిస్థితుల్లో వ్యాపారం సజావుగా సాగాలని… ఏం చేద్దాం అంటూ వ్యాపారులు నేతలకు ముడుపులు ముట్టజెపుతున్నారట.. కొందరు కౌన్సిలర్లు ఏకంగా తమ వార్డులో వైన్స్ షాప్ పెట్టాలంటే వాటాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. లేదంటే 5 లక్షలు నుంచి 15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే షాప్ ఎలా పెడుతారో చూస్తా.. ఎలా నడుపుతారో చూస్తా అంటూ బెదిరెంపులకు దిగుతున్నారట.. కౌన్సిలర్లు, నేతల వేధింపులు భరించలేక వ్యాపారులు తప్పని పరిస్థితులలో డబ్బులు ముట్ట చెపుతున్నారు. సిద్దిపేట కరీంనగర్ రహదారి లో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక వైన్స్ ఏర్పాటుకు ఆ వార్డ్ కౌన్సిలర్ భర్త, ఓ నాయకుడు కలిసి 15 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. అక్కడ వైన్స్ ఏర్పాటు చేస్తే తమ అనుమతి తప్పని సరి అని, తమ అనుమతి లేకుండా షాప్ ఎలా పెడుతున్నారో చూస్తామని కౌన్సిలర్ భర్త, ఆ నాయకుడు బెదిరించి మరి డబ్బులు వసూళ్ల చేశారట.. వారి బెదిరింపులతో సదరు వ్యాపారులు కంగుతిన్నారని విశ్వసనీయ సమాచారం.

ఇది ఇలా ఉంటే సదరు వైన్స్ షాప్ చుట్టూ ఆ రాజకీయ నాయకుడు, కౌన్సిలర్ భర్త డబ్బాలు ( రేకులతో తయారు చేసిన షాప్ ) ఏర్పాటు చేసి చిల్లర వ్యాపారులకు 30 వేలరూపాయలకు కిరాయికి ఇస్తూ మరో దందా కు తెరలేపాడని స్థానికులు, పలువురు సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. మున్సిపల్ అధికారులు నిమ్మకుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇది ఇలా ఉంటే హైదరాబాద్ రోడ్ లో ఇప్పటికే ఏర్పాటు చేసిన వైన్స్ షాప్ యాజమాన్యంపై అక్కడి కౌన్సిలర్ తనకు డబ్బు ఇవ్వకుండా వ్యాపారం ఎలా చేస్తవు.. డబ్బులు ఇవ్వకుంటే ఎలా వ్యాపారం నడుపుతావో చూస్తా అంటూ వేధిస్తున్నట్లు సమాచారం. ఎప్పటికి డబ్బులు ఇవ్వకుంటే తానంటే ఏంటో చూపిస్తా అంటూ బెదిరిస్తున్నారట.. వైన్స్ షాప్ టెందర్లో డాకించుకున్నాం అన్నా సంతోషం లేకుండా స్థానిక కౌన్సిలర్ల, రాజకీయ నేతల వేధింపులకు వ్యాపారులు బెంబేలెత్తుతున్నారు. వైన్స్ షాపుల ఏర్పాటు పై రాజకీయ నేతలు, కౌన్సిలర్లు చేస్తున్న అరాచకాలు మాములుగా లేవు. ఒకింత వైన్స్ షాప్ ఏర్పాటులో ధర్నా, రాస్తా రోకోలు చేసి డబ్బులు వసూళ్ల దందా కు మున్సిపల్ అధికారులు సైతం సహకరిస్తున్నట్లు సమాచారం. సిద్దిపేట లో నూతనంగా ఏర్పాటు చేసిన వైన్స్ షాప్ భవనానికి కమర్షియల్ అనుమతి లేదంటూ మున్సిపల్ కమిషనర్ నోటీసు ఇవ్వడం పలు అనుమానాలకు గురి చేస్తుంది. భవన నిర్మాణం పూర్తయి సంవత్సరాలు గడుస్తున్న, ఆ భవనంలో ఇప్పటికే పలు వ్యాపారాలు చేసిన చూసిచూడనట్లు ఉన్న కమిషనర్ వైన్స్ ఏర్పాటు చేయగానే నోటీసులు ఇవ్వడం వెనుక దాగి ఉన్న మర్మం ఏమిటో అని పలువురు సందేహం వెలిబుచ్చుతున్నారు. ఈ తతంగమంతా వసూళ్ల దందా కోసమేనని పలువురు సిద్దిపేటలో మున్సిపల్ పాలనపై గుసగుసలాడు కుంటున్నారు.

వ్యాపారం ఏదైనా మామూలు ఇవ్వాల్సిందే..


సిద్దిపేటలో ఏదైనా వ్యాపారం చేయాలంటే ముందుగా స్థానిక కౌన్సిలర్ కు మామూలు ఇవ్వాల్సిందే.. లేకుంటే ఆ వ్యాపారం ఎలా నడుస్తుందో చూస్తామంటూ సదురు వార్డు కౌన్సిలర్ బెదిరిస్తున్నారు. తమ వార్డుల్లో పాన్ షాప్ పెట్టిన 50, వేలు ఇస్తున్నారు అంటూ మీరు వైన్స్ పెడితే కనీసం 10 లక్షలైనా ఇవ్వాల్సిందేనని ఆ కౌన్సిలర్ డిమాండ్ చేశారు. ఇదేంటని సదరు వైన్స్ యజమాని ఆశ్చర్యానికి లోనయ్యాడు. లక్ష రూపాయలు తీసి ఇచ్చిన యజమానితో తిరస్కరిస్తూ.. తమ వార్డులో పాన్ షాప్ ఓపెన్ చేస్తే 50 వేలు ఇస్తున్నారు.. మీరు ముష్టిస్తున్నారా అంటూ కౌన్సిలర్ బహిరంగంగానే చెప్తున్నాడంట.. ఇది చూస్తుంటే సిద్దిపేట కౌన్సిలర్ల వసూళ్ల దందా ఏ స్థాయిలో మితిమీరిందో తెలుస్తుంది ఇక వార్డులో నిర్మాణాలు చేపడితే అంతే సంగతులు.. ఒక్కో ఫ్లోర్ కు లక్ష చొప్పున చెల్లించాల్సిందేనట.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *