సిద్దిపేటలో అమానుషం…
20వేల కోసం అన్న వదినను కట్టేసిన తమ్ముడు
కనకయ్య వద్ద లక్ష 20వేల అప్పు తీసుకున్న అన్న పర్షా రాములు
ఇప్పటికే లక్ష చెల్లించిన అన్న
సిద్దిపేట టైమ్స్ సిద్దిపేట ప్రతినిధి :
మానవత్వ విలువలు, బంధాలు అనుబంధాలు ఆత్మీయతలు డబ్బు ముందుట ఓడిపోతున్నాయి. డబ్బు ముందట ఆఖరికి రక్త సంబంధం దూరమవుతుంది.డబ్బు తో సమస్యల సుడిగుండం వెంటాడుతుంది. స్వంత తమ్ముడే కదా అని అప్పు తీసుకున్నందుకు అన్నకు శాపం అయింది. తల్లి తర్వాత వదిన ను తల్లిగా భావిస్తాం. కానీ డబ్బు అనే అహంకారం తో బంధాలు ఇంటి పరువు తీస్తున్నాయి. అన్న వదినలను గుడి గేటు కు కట్టేసే స్థితికి “అప్పు” మిత్తీ తెచ్చినా ఘటన సిద్దిపేట పట్టణ పరిధిలోని నాసార్ పురాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. డబ్బుల విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ పెరిగి పెరిగి అన్న వదినను
మరిది కనకయ్య గుడి ప్రహారికి తాడుతో కట్టేశాడు. తమ్ముడు కనకయ్య వద్ద అన్న పర్ష రాములు ఎనిమిది నెలల కిందట అప్పుగా లక్ష ఇరవై వేలు తీసుకున్నాడు. తిరిగి లక్ష చెల్లించగా మిగిలిన 20 వేలు మిత్తి ఇవ్వాలంటూ తమను చెట్టుకు కట్టేసాడని అన్న పరశురాములు విలపించారు. అనంతరం బాధితులు సిద్దిపేట వన్ టౌన్ లో ఫిర్యాదు చేశారు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అనంతరం పర్శా రాములుని చికిత్స నిమిత్తం పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.