హుస్నాబాద్ లో ఇండోర్ స్టేడియాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి
బిఆర్ఎస్ నేత బత్తుల జగ్జీవన్ రామ్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఇండోర్ స్టేడియం కొన్ని రోజులుగా తాళం వేసి ఉంచుతున్నారని అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ నేత బత్తుల జగ్జీవన్ రామ్ అధికారులను కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం కోట్లు ఖర్చుపెట్టి ప్రజలకు అందుబాటులో ఉండాలని హుస్నాబాద్ పట్టణంలో ఇండోర్ స్టేడియం నిర్మిస్తే అధికారులు మాత్రం దానికి తాళం వేసి ఉంచారని గత కొన్ని రోజులుగా ఇండోర్ స్టేడియం మూసి ఉంటుందన్నారు పట్టణంలోని ప్రజలు ఉదయం పూట మార్నింగ్ వాకర్స్ కి అందుబాటులో ఉంచాలని కోరారు స్టేడియం మూసి ఉండడంతో ఇటు క్రీడాకారులకు మార్నింగ్ వాకర్స్ కు ఇబ్బంది కలుగుతుందన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి క్రీడాకారులు నిరాశ పడకుండా అందరికీ అందుబాటులో ఉండేలా వెంటనే ఇండోర్ స్టేడియంని ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు.