పెంచిన మద్యం ధరలు తగ్గించాలి
రాష్ట్ర ఆదాయం కోసం మద్యం ప్రియుల పై ఆర్థిక బారం మోపద్దు
బి ఆర్ యస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరల పెంచి మద్యం ప్రియుల పై ఆర్థిక భారం మోపుతుంది అని, ఇప్పటి కే గ్రామాల్లో విచ్చల విడిగా బెల్టు షాప్ లు పెట్టి అడ్డగోలుగా మద్యం ప్రియుల దగ్గర దోచుకుంటుందని, మరో పక్క రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కోసం మద్యం సీసా ల పై ధరలు పెంచారని, ప్రభుత్వ నిర్ణయం దాదాపు ఇంటి ఇంటి కీ అధిక భారం పడే విధంగా తీసుకుని, ప్రజల పై ఎలాంటి ధరల భారం మోపము అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మాట మర్చి కాంగ్రెస్ పార్టీ గద్దె నెక్కడం కోసం అడ్డగోలుగా హామీలు ఇచ్చి ప్రజలన్ని ఇబ్బందులు గురి చేస్తుంది అని నియోజకవర్గ అధికార ప్రతినిధి అది లేని మల్లికార్జున్రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేక తప్పించుక తిరుగుతుందన్నారు. కనీసం ఇప్పటికైన ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు మానుకొని ప్రజల పై ఆర్థిక భారం పడకుండా చూడాలని కోరుతున్నాం లేకుంటే ప్రజల పక్షాన నిలబడి బి ఆర్ యస్ పోరాడుతుంది అని తెలిపారు.





