తెలంగాణ బడ్జెట్లో ఆటో డ్రైవర్లకు మొండి చెయ్యి..!
ఆరు గ్యారంటీలో వారికి ఇస్తానన్న ఆర్థిక సాయం ప్రస్తావనే లేకపోవడం బాధాకరం.
ఆటో ఈఎంఐలు కట్టుకోలేక, కుటుంబ పోషణ భారమైయి, అనేక మంది ఆటో డ్రైవర్లు మనస్థాపానికి గురై, నరక వేదన అనుభవిస్తున్నారు.
ఆటో డ్రైవర్లను ఆదుకోండి – బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల శంకర్ బాబు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మంగళవారం విలేకరుల సమావేశంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ… తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలో భాగంగా రవాణా -ఆటో డ్రైవర్ల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రవాణా -ఆటో డ్రైవర్ల సంక్షేమానికి రూపాయి బిల్ల కూడా కేటాయించకుండా వారిని విస్మరించడం బాధాకరమన్నారు. ఆటో డ్రైవర్లకు ప్రతి ఏడాది రూ. 15 వేలు ఆర్థిక సహాయం అందజేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రవాణా వాహనాలపై సింగిల్ పర్మిట్ విధానాన్ని ప్రవేశపెడతామని, రవాణా వాహనాల ఫిట్నెస్ చలనాలను సంవత్సరానికి ఒకసారి సమీక్షించి స్వీకరిస్తామని, ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, సామాజిక భద్రత కల్పిస్తామని, ప్రతి పట్టణంలో ఆటోనగర్ ఏర్పాటు చేస్తామని, పెండింగ్లో ఉన్న అన్ని ట్రాఫిక్ చలనాలు 50 శాతం రాయితీతో వన్ టైమ్ సెటిల్మెంట్ చేస్తామని ఆరు రకాల హామీ ఇచ్చి, ఏడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ వరకు వారికి నయా పైసా ఇవ్వకుండా బడ్జెట్లో గుండు సున్నా ఇచ్చి ఆటో డ్రైవర్ల నోట్లో మన్ను కొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమని విమర్శించారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలో దాదాపు 1000 మంది ఆటో డ్రైవర్లు రోజు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షలమంది ఆటో డ్రైవర్లు ఉండగా, 3 లక్షల మంది స్వంత ఆటోలు ఉండగా, 2 లక్షల మందికి ఈఎంఐలతో, మరి కొందరు కిరాయికి తీసుకుని ఆటో డ్రైవర్లు వారి కుటుంబాని పోషించుకుంటున్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా వారి కుటుంబాలు రోడ్డున పడి, ఈఎంఐలు కట్టుకోలేక, కిరాయిలు రాక, ఫైనాన్స్ సంస్థ వారు ఆటోలు గుజ్జుకపోగా, డ్రైవర్ వృత్తిని నమ్ముకొని, కుటుంబ పోషణ భారమైయి చాలా మంది ఆటో డ్రైవర్లు మనస్థాపానికి గురై నరక యాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఈ బడ్జెట్ సెషన్ లో ఆటో డ్రైవర్ల సంక్షేమానికి బడ్జెట్ కేటాయించి, వారిని ఆదుకోవాలని బీజేపీ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆటో డ్రైవర్లను ఐక్యం చేసి పెద్దయెత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ హుస్నాబాద్ పట్టణ ఉపాధ్యక్షులు గాదాసు రాంప్రసాద్, అధికార ప్రతినిధి నారోజు నరేష్, బీజేవైయం పట్టణ అధ్యక్షుడు పోలోజు రాజేందర్, బీజేపీ పట్టణ నాయకులు బొడిగే వెంకటేష్, ఆశాడపు శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.