హుస్నాబాద్ నియోజకవర్గంలో రెండో విడత రైతు రుణమాఫీ 93 కోట్ల 89 లక్షలు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంది. ఇప్పటికే లక్ష రూపాయల వరకు రైతు రుణమాఫీ పూర్తి కాగ ఈరొజు లక్ష 50 వేల రూపాయల వరకు రైతు రుణమాఫీ ని పూర్తి చేసింది.
మంగళవారం రైతు రుణమాఫీ పథకం క్రింద హుస్నాబాద్ నియోజకవర్గ పరిధి నందు రెండో విడత అనగా 1లక్ష 50 వేల రూపాయల వరకు రుణమాఫీ తో లబ్ధి పొందిన కుటుంబాలు 7,997, రైతులు 9,211.
హుస్నాబాద్ నియోజకవర్గానికి లక్షా 50 వేల వరకు రైతు రుణమాఫీ కింద 93 కోట్ల 89 లక్షల ఆర్థిక సహాయం అందింది.