యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా..
గ్రామంలో వెలసిన అక్రమ ఇసుక డంపులు..
పట్టించుకోని రెవెన్యూ, పోలీసు శాఖ
సిద్ధిపేట టైమ్స్, మద్దూరు:

సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం జాలపల్లి గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా అక్రమంగా ఇసుక రవాణా జోరుగా సాగుతుంది.జాలపల్లి గ్రామంలోని మోయతుమ్మెద వాగు నుండి దాదాపు 500 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుకను అక్రమంగా తరలిస్తూ గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో ఇసుక డంపులను ఏర్పాటు చేశారు.రాత్రివేళలో ఇసుక డంపుల నుండి ట్రాక్టర్ ల ద్వారా చుట్టుపక్కల గ్రామాలకు తరలించి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు.పట్టపగలే అక్రమంగా ఇసుక తరలిస్తున్న అటు రెవెన్యూ,పోలీసు అధికారులు స్పందించకపోవడంపై గ్రామస్తులు,స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ట్రాక్టర్ యూనియన్ సంఘం సభ్యులు ట్రాక్టర్ ల యజమానుల నుంచి డబ్బులు వసూలు చేసి రెవిన్యూ,పోలీసు యంత్రాంగానికి ముడుపులు చెల్లిస్తూ ఇష్టానుసారంగా ఇసుకను తవ్వేస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.ధూళిమిట్ట తహసీల్దార్ ఎర్రోళ్ల శ్యామ్ ను ఫోన్ లో వివరణ కోరగా స్పందించడం లేదు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు,స్థానికులు కోరుతున్నారు.

