“కొండంత… దోపిడి”కొండపోచమ్మ ప్రాంగణంలో అక్రమ మట్టి తవ్వకాలు..యదేచ్చగా సాగుతున్న మట్టి దందా..లక్షలాది రూపాయలు  దండుకుంటున్న అక్రమార్కులు..

“కొండంత… దోపిడి”కొండపోచమ్మ ప్రాంగణంలో అక్రమ మట్టి తవ్వకాలు..యదేచ్చగా సాగుతున్న మట్టి దందా..లక్షలాది రూపాయలు  దండుకుంటున్న అక్రమార్కులు..

“కొండంత… దోపిడి”
కొండపోచమ్మ ప్రాంగణంలో అక్రమ మట్టి తవ్వకాలు..
యదేచ్చగా సాగుతున్న మట్టి దందా..
లక్షలాది రూపాయలు  దండుకుంటున్న అక్రమార్కులు..
నిద్రాణ స్థితిలో దేవాదాయ, రెవెన్యూ అధికారులు..
పెట్రేగిపోతున్న  రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు..
అధికారుల కనుసైగల్లోనే దందా సాగుతోందంటూ గ్రామాస్తుల ఆరోపణలు..

సిద్ధిపేట టైమ్స్, జగదేవపూర్

మట్టి మాఫియా రెచ్చిపోతుంది.. కళ్ళు మూసి తెరిచేలోపు గుట్టలు గుట్టలు మాయమైపోతున్నాయి…. తెల్లవారుజామున వచ్చే చూసి సరికి ఇక్కడ ఒక పాలన గుట్ట ఉండేది అని చెప్పుకోవడమే తప్ప కనిపించకుండా మారిపోతుంది. ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం కొండలను, గుట్టలను కూడా లెక్క చేయకుండా పిండి చేసి నాశనం చేస్తున్నారు. ప్రశ్నించిన వారితో అధికారులే  మాకు పర్మిషన్ ఇచ్చారు.. మీరెవ్వరు అడగటానికి  అంటూ
భూమి ..మాదే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటున్నారు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు. కొండపోచమ్మ ఆలయం పై సిద్ధిపేట టైమ్స్ అందిస్తున్న ప్రత్యేక కథనం.

  జగదేవపూర్ మండలంలోని   తీగుల్ నర్సాపూర్ లో గల ప్రసిద్ధి  గాంచిన పుణ్యక్షేత్రం గా చెప్పుకుంటున్న కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి తెలంగాణా రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు వస్తుంటారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు మొక్కి కోరిన కోర్కెలు తీరడంతో మొక్కులు సమర్పించి గుడి ప్రాంగణం చుట్టూ ఉన్న ఎత్తైన కొండలు, గుట్టలు చుట్టూ తిరుగుతూ  ఆస్వాదించి వెళుతుంటారు.  భూములు విలువలు అమాంతంగా పెరిగిపోవడంతో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల కన్ను గుట్టలపై పడింది. గుట్టలను ఎలాగైనా చదును చేసి ఇక ఫ్లాట్లను కొట్టి అమ్ముకోవాలనే దరుద్దేశంతో రాత్రి, పగలు అనే తేడా లేకుండా గుట్టలను చదను చేసే పనిలో నిమగ్నమయ్యారు. దానికి తోడు అధికారులు కూడా వారికి వత్తాసు పలుకుతున్నారట. అంతేకాకుండా ఎవరైనా అడ్డు చేపితే మా వద్ద దీనికి సంబంధించిన పట్టా పాస్ బుక్కులు ఉన్నాయని చెబుతున్నారట. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులుకు తెలియడం లేదా…లేక తెలిసినా తెలియనట్టు వ్యవరిస్తున్నారా అనేది ఓ ప్రశ్నగా మిగిలిపోయింది. ఒకవేళ మామూలుగా తీసుకోకపోతే గత నాలుగు రోజుల నుండి గుట్టను చదును చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలపై చర్యలను ఎందుకు తీసుకోవడం లేదని అధికారులపై  పలువురు భక్తులు, గ్రామస్తులు మండిపడుతున్నారు.

*భూమి కోసమా… దాగివున్న ఆభరణాల కోసమా…?*
గుట్టను తవ్వేది భూమి కోసం కాదని పూర్వ కాలంలో కొండపోచమ్మ ఆలయం గుట్టలో బావి ఉండేదని ఆ బావిలోపల నిజాం నవాబుల కాలంలో బంగారు ఆభరణాలు వజ్ర వైడుర్యాలు దాచి పెట్టారని పూర్వీకులు చెబుతుందేవారు. వాటిని ఎలాగైనా దక్కించుకోవాలని వాటిపై కన్నేసి  కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వాటికోసమే గుట్టలను కూడా చూడకుండా స్వాహా చేసేందుకు సిద్దమైనారా అని పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు కూడా వారికి వత్తాసు పలకడం ఏంటని అధికారులపై పలువురు గ్రామస్తులు మండిపడుతున్నారు. గ్రామంలో  ఎదైనా జరగరాని ముప్పు సంభవిస్తే భాద్యత వహించేది ఎవరని గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వారి వద్ద మామూలు తీసుకున్నారో లేరో తెలియదు కానీ మామూళ్ల మత్తులో ఉంటే మాత్రం మత్తు వీడి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల నుండి  కొండపోచమ్మ కాపాడాలని కోరుతున్నారు.

గుట్టను చదును చేసే వారిపై చర్యలు తీసుకుంటాం…
కృష్ణమూర్తి, తహసీల్దార్
కొండపోచమ్మ ఆలయగుట్టపై ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. గుడి ప్రాంగణంలో ఉన్న గుట్టలను తొలగించే హక్కులు ఎవరికి లేదు. అది పట్టా భూములైన ఇతరత్రా భూములైన సరే ఎవరైనా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

**గత ప్రభుత్యం లో ఇలా జరగలేదు**

మండల బి ఆర్ ఎస్ నాయకులు దాచారం కనకయ్య

10 సంవత్సరాల బి ఆర్ ఎస్  ప్రభుత్వ హయాంలో  రాష్ట్రంలో ఏ ఒక్క దేవాలయ భూములను ఏ ఒక్కరూ ఆక్రమించలేదని మాజీ మంత్రి మంత్రి కేసీఆర్ కొండపోచమ్మ అభివృద్ధి కోసం వంద ఎకరాల భూమిని కేటాయించాలని సూచించారనీ  గుట్టను ఏ ఒక్కరు కూడా కబ్జాలు కానీ తవ్వి భూమిని ఆక్రమించలేదనీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన సంవత్సర కాలంలోనే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని మండిపడ్డారు .

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *