ఎమర్జెన్సీ ని తలపిస్తున్న అక్రమ అరెస్టులు
సంక్షేమ హాస్టల్లలో 114 మంది విద్యార్థులు చనిపోయినందుకా విజయోత్సవాలు
ఏబీవీపీ సిద్దిపేట జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్య
సిద్దిపేట టైమ్స్. వెబ్ డెస్క్:
ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని తలపించే విధంగా విద్యార్థుల పక్షాన విద్యారంగ సమస్యలను ఎత్తిచూపితే హుస్నాబాద్ లో సీఎం సభ ఉన్న కారణంగా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ఏబీవీపీ నాయకులను జిల్లా కేంద్రంలో మరియు హుస్నాబాద్ మండల కేంద్రంలో ఈరోజు తెల్లవారుజామున గం. 5 లకే అక్రమ అరెస్టు చేయడాన్ని ఏబీవీపీ సిద్దిపేట జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్య తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం కాదు పోలీసుల పాలన, ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీ పాలనను తలపించే విధంగా విద్యార్థుల పక్షాన విద్యారంగ సమస్యల పరిష్కరించడానికై ప్రశ్నించే గొంతులను అణిచివేసే విధంగా పోలీసులను అడ్డం పెట్టుకొని ముందస్తు అరెస్టులతో నిర్బంధించడం సరికాదని విమర్శించారు. విద్యాశాఖను గాలికి వదిలి రాజకీయాలు చేస్తూ మళ్లీ ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తునందున విజయోత్సవాలు అని హుస్నాబాద్ గడ్డపై నిర్వహిస్తుండడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది విజయోత్సవ సభ కాదని ప్రభుత్వం ఏర్పడిన ఈ 2 సంవత్సరాలలో ప్రభుత్వ గురుకులాలలో సంక్షేమ హాస్టల్ల లో ఫుడ్ పాయిజన్ కి గురై చనిపోయిన 114 మంది విద్యార్థులు శవాలపైన రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆరు గ్యారెంటీలలో ఒకటైన విద్యార్థులకు యువ వికాసం పేరుతో రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ కడతామన్న హామీలు గంగలో వదిలేసి కనీసం విద్యాశాఖను పట్టించుకోకుండా నిర్వీర్యం చేస్తూ విద్యాశాఖకు మంత్రి నియమించకుండా సీఎం వద్దనే విద్య శాఖను పెట్టుకుని చరిత్రలో ఎన్నడూ లేని విధంగా డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలలు స్కాలర్ షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని కళాశాల యాజమాన్యాలు స్వయంగా 3 సార్లు బంద్ కి పిలుపునిచ్చినప్పటికీ స్కాలర్ షిప్స్ ,రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకుండా కళాశాల యాజమాన్యాలను స్వయంగా ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి బెదిరించినటువంటి దుస్థితి నెలకొందన్నారు. ఇలా రాష్ట్ర ప్రజలనే కాకుండా విద్యార్థులను కూడా మోసం చేస్తూ విద్య శాఖను నిర్వీర్యం చేస్తూ పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను దూరం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థులే గుణపాఠం చెప్తారని అన్నారు. అరెస్ట్ అయిన వారిలో సిద్దిపేటలో జిల్లా కన్వీనర్ ఆదిత్య, నగర కార్యదర్శి పరుశురాం అలాగే హుస్నాబాద్ లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాకేష్, జిల్లా హాస్టల్స్ కన్వీనర్ రాజేష్, నగర కార్యదర్శి చరణ్, సంయుక్త కార్యదర్శి అంజి ఉన్నారు.






