రాజకీయాల్లో ఎదగాలంటే రోశయ్యనే ఆదర్శం
కొణిజేటి రోశయ్యది రాజకీయాల్లో విశిష్టమైన వ్యక్తిత్వం
ఆర్య వైశ్య ముద్దు బిడ్డ..అందరూ వారి మార్గదర్శకత్వంలో నడవాలి
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మూడవ వర్ధంతి సభలో మంత్రి పొన్నం
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మూడవ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద రోశయ్య చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యది రాజకీయాల్లో విశిష్టమైన వ్యక్తిత్వంమని, ఎవరైనా రాజకీయాల్లో ఎదగాలని అనుకుంటే రోశయ్యనే ఆదర్శంగా తీసుకోవాలని, ప్రతిపక్షాన్ని మాటల తూటాలు పేల్చడంలో కొట్టకనే కొట్టినట్టు మాట్లాడేవారని, వైఎస్ఆర్ అకాల మరణం తరువాత అందరి ఆమోదయోగ్యం తో ముఖ్యమంత్రి అయ్యారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నేను NSUI అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారు పీసీసీ గా పదవీ చేశారని, నా రాజకీయ గురువు చొక్కరావు తో రోశయ్య గంటలు గంటలు చర్చించేవారని గుర్తు చేసుకున్నారు. గొప్ప వ్యక్తుల విగ్రహాలు వారిని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్ లో వారిని స్ఫూర్తిని తీసుకునే విధంగా ఉండాలని పెట్టుకుంటామని, దూరదృష్టి తో ఆలోచనలు చేయడంలో రోశయ్య నిష్ణాతులని, అసెంబ్లీలో 18 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారని, ఆయన బడ్జెట్ పెడితే లోటు బడ్జెట్ లేకుండ ఉండేదని అన్నారు. హుస్నాబాద్ లో వైశ్య భవనం, వైశ్య కళ్యాణ మండపానికి ఆయన గతంలో ఇక్కడికి వచ్చారని, ఆర్య వైశ్య ముద్దు బిడ్డ..వారి మార్గదర్శకత్వంలో అందరూ నడవాలన్నారు. వారి లాగ శ్రమపడే విధానం, సమయ స్ఫూర్తి , ఆర్థిక పరిపుష్టి ఉంటే జీవితంలో ఎదగడానికి అవకాశం ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంక చందు, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, కౌన్సిలర్లు, ఆర్డీవో, ఎమ్మార్వో, ఇతర ముఖ్య నేతలు ,ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.