అభివృద్ధి చేస్తారని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఉన్నది కాస్త పోయింది.. మాజీ మంత్రి హరీష్ రావు..

అభివృద్ధి చేస్తారని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఉన్నది కాస్త పోయింది.. మాజీ మంత్రి హరీష్ రావు..

అభివృద్ధి చేస్తారని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఉన్నది కాస్త పోయింది..
రానున్నవి మంచి రోజులే వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే..
ప్రజా సేవకు విరమణ ఉండదు మనం ప్రజల మధ్యనే ఉండాలి..
మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు..

సిద్దిపేట్ టైమ్స్ దుబ్బాక,

ప్రజాసేవకు విరమణ ఉండదని ప్రజలకు నిరంతరం సేవ చేయడమే ఒక రాజకీయ నాయకుడి లక్షణం అని, అప్పుడే ఆ రాజకీయ నాయకుడు మళ్లీ ప్రజల్లోకి వచ్చి సేవ చేసేందుకు ముందు వరసగా ఉంటాడని మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. దుబ్బాక పట్టణంలో కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి ఫంక్షన్ హాల్లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఏర్పాటు చేసిన జడ్పిటిసి ఎంపీపీ ఎంపిటిసిల పదవీ విరమణ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….కాంగ్రెస్ పాలనలో ప్రజాప్రతినిధులు చేసిన పనులకు బిల్లులు రావడం లేదని, పంచాయతీల అభివృద్ధి కోసం చేసిన అప్పులు తీర్చలేక ఎంపీటీసీలు, సర్పంచ్లు అనేక అవస్థలు పడుతున్నారని, పంచాయతీ కార్మికులకు జీతాలు లేవని, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులను చెల్లించలేని స్థితిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందన్నారు. ఆసరా పెన్షన్లను రూ. 2 వేల నుంచి రూ. 4 వేలకు పెంచుతామని, రైతు బంధు కింద రూ. 5 వేల నుంచి రూ. ఏడున్నర వేలకు పెంచుతామని నమ్మబలికి కాంగ్రెస్ సర్కార్ ఓట్లేసుకుందని, ఫలితంగా పెట్టుబడి సాయం రాక రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యలు చేసుకుని పరిస్థితికి తీసుకొచ్చిందని ఆరోపించారు. కేసీఆర్ సర్కార్లో సాగు, తాగు నీటికి కొదువ లేకుండా ఉండేదని, సాగు, తాగు నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. 24 గంటల్లో కనురెప్ప పాటున కూడా కరెంట్ పోకుండా కేసీఆర్ సర్కార్ చూసుకుందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడొస్తుందో ఎవరికి తెలియడం లేదని, దీనికి ఉద్యోగులను బాధ్యులను చేస్తూ వేధిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్లో మాన భంగాలు, మర్డర్లు పెరిగిపోయాయని, లా అండ్ ఆర్డర్ ఆగమైపోయిందని ఆరోపించారు. కేసీఆర్ కిట్టు, సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి చెక్కులను ఏడు నెలలైనా ఇవ్వడంలేదని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో బాయికాడి మోటార్లు కాలిపోలేదని, ఇప్పుడెందుకు కాలుతున్నాయో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన నిలబడి పోరాడుతామని, తెలంగాణ ప్రజలకు రానున్నవి మంచి రోజులేనని, వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని ఏ ఒక్క కార్యకర్త ఆధైర్య పడొద్దని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా ఏంటో చూపించాలని పిలుపు నిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గం నుంచి మంచి మెజార్టీ ఇచ్చారని, ఇదే స్ఫూర్తితో పని చేయాలని ఆయన కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, ఆయా మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *