ప్రభాకర్ రావును కలిసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా: హరీశ్ రావు..
సిద్దిపేట టైమ్స్, వెబ్
మంత్రి కోమటిరెడ్డి చేసిన విమర్శల కు మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. కోమటిరెడ్డి వాక్యాలు అర్థరహితమంటు కౌంటర్ వేశారు హరీష్ రావు. తాను అమెరికాలో ప్రభాకర్ రావును కలిసినట్లు నిరూపిస్తే అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాస్తానని అన్నారు. మంత్రి కోమటిరెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ గా ఎమ్మెల్యే హరీశ్ రావు సీరియస్ కౌంటర్ ఇచ్చారు. రుజువు చేయకపోతే మంత్రి కోమటిరెడ్డి ముక్కు నేలకు రాయాలని ప్రతి సవాల్ చేశారు. తాను కుటుంబసభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లానని ట్వీట్ చేశారు. తాను ఎక్కడికి వెళ్లాననే వివరాలు ఇవ్వడానికి సిద్ధమన్నారు. మంత్రి రుజువులతో రావాలని డిమాండ్ చేశారు.