కడుపు నొప్పి అని వస్తే.. శవాన్ని అప్పగించారు…
అపెండెక్స్ ఆపరేషన్ వికటించి యువకుడు మృతి..
డాక్టర్స్ నిర్లక్ష్యం వల్లే తన బిడ్డ చనిపోయాడని కూటింబికుల ఆందోళన..
సిద్దిపేట లోహిత్ సాయి ఆసుపత్రిలో ఘటన…
ఆపరేషన్ చేయలేదని ఒకసారి.. చేశామని ఒకసారి..
డాక్టర్స్ పోంతనలేని సమాధానం..
న్యాయం చేయాలని బాధితుల డిమాండ్..
సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేట జూలై 13

కడుపు నోప్పి అని ప్రయివేటు హాస్పిటల్ కు నడుచుకుంటు వేళ్ళిన.. వ్యక్తిని శవంగా తిరిగి ఇచ్చారు.. ఈ ఘటన సిద్దిపేట లోని ఓ ప్రయివేట్ ఆస్పిటల్ లో జరిగింది.. మృతుని బంధువులు ఇదేంటని ప్రశ్నిస్తే.. తాము అసలు సర్జరీ చేయనేలేదని.. మరో సారి లేదు.. లేదు.. సర్జరీ చేశామంటు.. సదరు డాక్టరు చేప్పిన పొంతన లేని సమాధానం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏదీ ఎమైనా డాక్టర్ల నిర్లక్ష్యంతో ఓక నిండు ప్రాణం బలితీసుకున్నారని బాధితుడి కుటుంబం ఆరోపిస్తుంది.. అపెండెక్స్ ఆపరేషన్ వికటించిందని మృతికి బంధువులు ఆరోపిస్తున్నారు.
ఈ సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రం లోని లోహిత్ సాయి ఆసుపత్రిలో చోటు చేసుకుంది. కుటుంబికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని సాజిద్ పుర కు చెందిన అహ్మద్ ఇర్ఫాన్ ఉద్దిన్ పటేల్(28) గత కొన్ని రోజులుగా కడుపు నోప్పితో బాధపడుతున్నాడు. ఆపరేషన్ తప్పనిసరి కావడంతో ఈ నెల 11న స్థానిక మసీదు లో ప్రార్ధన ముగించుకున్న అనంతరం ఇర్ఫాన్ స్వయంగా నడుచుకుంటూ పట్టణంలోని లోహిత్ సాయి హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. అడ్మిట్ అయిన ఇర్ఫాన్ ను పరీక్షించిన డాక్టర్లు అపెండెక్స్ ఆపరేషన్
చేయాల్సిన పరిస్థితి ఉందని..
వైద్యులు బాధితుణ్ణి ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లారు.. కొంత సేపటికి ఆపరేషన్ గదిలోంచి బయటకి వచ్చిన డాక్టర్లు, సిబ్బంది.. బీపీ తగ్గింది.. హుటాహుటిన హైదరాబాద్ కు తీసుకెళ్లండి అని చెప్పడంతో కుటుంబికులు.. కంగారుగా
హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రి కి తరలించారు.. అక్కడ చికిత్స పొందుతూ ఇర్ఫాన్ మృతి చెందాడు. అనుమానము వచ్చిన కుటుంబికులు సిద్దిపేట లోహిత్ సాయి ఆసుపత్రి డాక్టర్స్ ని సంప్రదించగ అసలు తాము అపెండెక్స్ ఆపరేషన్ చేయనే లేదని చెప్పారు. ఇదే విషయం కిమ్స్ ఆసుపత్రి లో ఆరా తీయగా.. ఇర్ఫాన్ కి చేసిన స్కానింగ్ టెస్టుల్లో ఆపరేషన్ చేశారని.. అపెండెక్స్ తీసేశారని నిర్ధారించారు. ఈ విషయాన్ని లోహిత్ సాయి హస్పిటల్ డాక్టర్స్ ని ప్రశ్నించగా ఆపరేషన్ జాగిందని తెలిపారు. ఒకసారి ఆపరేషన్ చేయలేదని.. మరోసారి చేశామని పొంతన లేని సమాధానం చెప్పడంతో మృతుడి బంధువులు కంగుతిన్నారు..
సిద్దిపేట లోహిత్ సాయి డాక్టర్స్ నిర్లక్ష్య సమాధానంతో.. డాక్టర్స్ నిర్లక్ష్యం వల్లే ఇర్ఫాన్ చనిపోయాడని బంధువులు
ఆరోపించారు. మృతునికి రెండు సంవత్సరాల క్రితం పెళ్లి కాగా ప్రస్తుతం 14 నెలలు బాబు ఉన్నాడు.

శోక సంద్రంలో కుటుంబం…
చేతికోచ్చిన కొడుకు తల్లిదండ్రులకు అండగా ఉంటాడని అనుకుంటే లోహిత్ సాయి ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల చేతికి రాకుండా పోయడానికి భోరుమన్నారు. గంపేడు ఆశలతో 28 ఏండ్ల ప్రయాంలో ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్నాయివకుడిని వైద్యులు పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. నవ్వుకుంటూ వెళ్లిన తన బిడ్డను శవం అప్పగించ్చారని మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలని ఇలాంటి మరో సంఘటన జరుగకుండా లోహిత్ సాయి డాక్టర్స్ లైసెన్స్ రద్దు చేసి నిర్లక్ష్యం తో నిండు ప్రాణాలు బలికొన్న డాక్టర్స్ సర్టిఫికెట్స్ ని రద్దు చేయాలన్నారు.






My request to the goverment to ban this hospital, I think this is the third time in this hospital same case is repeated due the negligence of the doctor’s