ఏసీపీ పని చాత గాకపోతే దిగిపో..
సిద్దిపేట ఏసీపీ కి చక్రధర్ వార్నింగ్..
ది సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట
సిద్దిపేట పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్, సీపీ కార్యాలయం లో సిసి ఫుటేజీ కావాలని , ఆర్టిఐ కింద కోరగా సిద్దిపేట ఏసిపి, సిసి ఫుటేజీ ఇవ్వడం అసాధ్యమని తెలిపినట్లు ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ నాయకులు చక్రధర్ గౌడ్ తెలిపారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఉన్న, సిద్దిపేట ఏసిపి మాత్రం సిసి ఫుటేజీ అసాధ్యమని ఎలా చెప్తారని ప్రశ్నించారు. కొన్ని సీసీ కెమెరాలు ఇంకా ఏర్పాటు దశలోనే ఉన్నాయని,రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 1000 మీటర్ల దూరంలో ఉన్న సిసి ఫుటేజ్ కావాలన్నా ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రజలకు సేవలు అందించడం చాత గాక పోతే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలని సిద్దిపేట ఏసీపీ కి కాంగ్రెస్ నాయకులు చక్రధర్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు.
సిద్దిపేట పోలీస్ స్టేషన్లలో సిసి ఫుటేజ్ పై హైకోర్టులో పిల్ దాఖలు చేయనున్నట్లు చక్రధర్ గౌడ్ తెలిపారు. సిద్దిపేట సి పి, ఎసిపి పై తగిన చర్యలు తీసుకోవాలని చక్రధర్ గౌడ్ కోరారు.
అంతగిరి చంద్రశేఖర్ విషయంలో ఏసీపీ, సీఐ కార్యాలయ సీసీ ఫుటేజీలు కావాలని ఆర్టీఐ కింద సమాచారం అడిగితే సీసీ కెమెరాలు నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పడం సిగ్గు చేటన్నారు. టాస్క్ ఫోర్స్ కార్యాలయ అవరణ లో ఫుటేజీలు లేవని, పోలీస్ స్టేషన్ కార్యాలయాల్లో సీసీ ఫుటేజీలు లేవంటే రోజు పీఎస్ లో ఎన్ని సెటిల్ మెంట్లు జరుగుతున్నాయని ప్రశ్నించారు. గంజాయి కేసులో తనను కాంగ్రెస్ కోవర్టులు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, అక్రమ కేసులు పెట్టాలని చూస్తే ఊరుకొనని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి పై టీఎస్ 24 చానల్ ప్రయోగించిన9 భాష బాగా లేదని, ఇష్టారీతిన వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. రాష్ట్రానికి కేంద్ర నిధులు తేవడం లో బీజేపీ ఎంపీ లు విఫలమయ్యారన్నారు.