గ్రామాభివృద్ధికై సేవకుడిలా పనిచేస్తాను
గ్రామ ప్రజలే నా బలం – గ్రామాభివృద్ధే నా లక్ష్యం
బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి వేముల నవీన్
హన్మకొండ/ ఆత్మకూరు/లింగమడుగుపల్లి:
పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఆత్మకూర్ మండలం లింగమడుగుపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వేముల నవీన్ ప్రచారం జోరుగా కొనసాగుతోంది. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారాలకు కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. గ్రామంలోని ప్రతి సమస్యను తనదైన బాధ్యతగా తీసుకుని, మౌలిక వసతుల అభివృద్ధి, రైతుల సంక్షేమం, యువతకు అవకాశాలు, మహిళల భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. గ్రామ ప్రజల ఆశీర్వాదంతో గెలిచి, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చెప్పారు. గ్రామ ప్రజల నుంచి లభిస్తున్న విశేష స్పందన తనకు మరింత ఉత్సాహాన్ని ఇస్తోందని అన్నారు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తనకు కేటాయించిన కత్తెర గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని గ్రామ ప్రజలను ఆయన కోరారు.
Posted inహనుమకొండ
గ్రామాభివృద్ధికై సేవకుడిలా పనిచేస్తాను




