నాయకురాలిగా కాదు… సేవకురాలిగా గ్రామానికి సేవ చేస్తా
మోత్కులపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఎల్పుగొండ కొమురమ్మ- రవీందర్
సిద్దిపేట టైమ్స్. హుస్నాబాద్ :
గ్రామ అభివృద్ధిని ఆకాంక్షించే మోత్కులపల్లి గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరు ఈనెల 17న జరిగే సర్పంచి ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎల్పుగొండ కొమురమ్మ- రవీందర్ అన్నారు. సర్పంచ్ గా గెలిపించినట్లయితే గ్రామంలో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా ప్రజలందరి సహకారంతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి పాటుపడతానని, ప్రైవేటు హాస్పిటల్ వారి సహకారంతో ప్రతి నెల ఉచిత మెడికల్ క్యాంపు గ్రామ ప్రజల కోసం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే దుర్గమ్మ తల్లి దేవాలయం, శ్రీరాముని ఆలయం, బీరన్న స్వామి ఆలయం నిర్మాణాల ఏర్పాటు సత్వరమే చేస్తానని అన్నారు. గ్రామంలో ఉన్న విద్యార్థులు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు అవసరమయ్యే విధంగా గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకాకుండా గ్రామంలోని కుల సంఘాలకు భవనాలను కూడా నిర్మిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకు క్రీడా సామాగ్రిని అందిస్తామని, గ్రామంలో ఇంకా అసంపూర్తిగా ఉన్న పనులను కూడా పూర్తి చేసి గ్రామ అభివృద్ధికి బాటలు వేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు.
Posted inహుస్నాబాద్
నాయకురాలిగా కాదు… సేవకురాలిగా గ్రామానికి సేవ చేస్తా





