నన్ను ఎమ్మెల్యే గా గెలిపించిన మీ అందరికీ అండగా ఉంటా..

నన్ను ఎమ్మెల్యే గా గెలిపించిన మీ అందరికీ అండగా ఉంటా..

హుస్నాబాద్ ప్రజలకు ధన్యవాదాలు.. నన్ను ఎమ్మెల్యే గా గెలిపించిన మీ అందరికీ అండగా ఉంటా..

ప్రజా సమస్యలు ఏమున్నా రాజకీయాలకు అతీతంగా అభివృద్ది చేస్తా

2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం ది

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వారు సిద్ధంగా ఉండాలి

ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు అమలు చేస్తున్నాం

హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో ముందుచుతా.. మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

తెలంగాణ లో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా బుధవారం రోజు రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ఎల్లమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. శాసన సభ ఎన్నికల ఫలితాలతో ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అయిన సందర్భంగా ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు బుధవారం నుండి 9 వ తేది వరకు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ప్రజా సంక్షేమం ప్రకృతి పాడి పంటలతో, ఉద్యోగ అవకాశాలు రాష్ట్ర ప్రజలకు అంత మంచిగా ఉండాలని అన్ని దేవాలయాలు, చర్చిలు, గురుద్వారాలో ప్రార్థనలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణ లో ప్రజాస్వామిక పరిపాలన మంచిగా ఉండాలని హుస్నాబాద్ చారిత్రాత్మక ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేయడం జరిగిందని, హుస్నాబాద్ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయి మంత్రిగా అవకాశం వచ్చిందని, అందరికీ అందుబాటులో ఉంటు హుస్నాబాద్ కు మంచి పేరు తీసుకొస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా పార్టీ కార్యక్రమాలు, మంత్రిగా నా శాఖ విది నిర్వహణలో మాత్రమే నిమగ్నం అయ్యానన్నారు. ప్రజలను కలవడం లో ఇబ్బందులు లేకుండా క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక వాట్సాప్ నెంబర్, ప్రత్యేక అపాయింట్మెంట్ కోసం హుస్నాబాద్ ప్రజల సమస్యల పై ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నామన్నారు. 7 వ తేది మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ప్రతి మండలంలో జరిగిన అభివృద్ది సంక్షేమం పై మండల నేతలు ప్రెస్ మీట్ లు నిర్వహించి ఆరోగ్య శ్రీ, మహిళల ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 గ్యాస్ లబ్దిదారుల తదితర వాటిపై మాట్లాడతారని, మూడు మార్కెట్ కమిటీలకు కొత్త పాలక వర్గాలు ఏర్పాటు చేసుకున్నామని, 4 దేవాలయాలకు కమిటీ లు ఇంకా రావాల్సి ఉందని, పని చేసే వారికే పదవులు వస్తాయని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వారు సిద్ధంగా ఉండాలన్నారు. మీ సమస్యలు ఏమున్నా నా దృష్టికి తీసుకురండి..ప్రజా సమస్యలు ఏమున్నా రాజకీయాలకు అతీతంగా అభివృద్ది చేస్తామన్నారు.

చౌటపల్లి గ్రామస్తులను బలవంతం చేయడం లేదని, పారిశ్రామిక కారిడార్ కు సహకరించాలి.. వారికి ఎక్కడ అన్యాయం చేయమన్నారు. టూరిజం పరంగా మహా సముద్రం గండి, ఎల్లమ్మ చెరువు సర్వాయి పాపన్న కోట, సింగరాయ జాతర లను టూరిజం గా అభివృద్ది చేస్తామన్నారు. గౌరవేళ్లి ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు నియోజకవర్గంలో ఉన్న 160  గ్రామాలకు నీటిని ఇస్తామన్నారు. కోహెడ మండలం బస్వపూర్, మొరేటి పల్లి గ్రామాలకు రంగనాయక సాగర్ నుండి సాగు నీరు అందుతుందని, కొంత భూసేకరణ ఇబ్బందులు ఉన్నా..సైదాపూర్  కెనాల్ 3 కింద 230 కోట్లు కేటాయిస్తే పూర్తవుతుందన్నారు. ఎల్కతుర్తి, భీమదేవరపల్లి కి దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీళ్లు వస్తాయని, గౌరవేల్లి, గండిపల్లి ప్రాజెక్టు లను పూర్తి చేసి ఎడమ, కుడి కాలువల నిర్మాణాలను పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తం.. భూసేకరణ జరుగుతుంది ఎత్తయిన ప్రాంతం కాలువల నిర్మాణానికి అందరూ సహకరిస్తున్నారని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందని, రాష్ట్రంలో 115 కోట్ల మంది మహిళలు ఇప్పటికీ ఉచితంగా ప్రయాణం చేశారని. ఉచిత విద్యుత్, 500 గ్యాస్ ఇస్తున్నాం, డైట్ & కాస్మొటిక్ చార్జీలు 40 శాతం పెంచాం..నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయి..2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ పూర్తయింది..ఇంకా ఎవరికైనా కాకపోతే నాకు సమాచారం ఇవ్వండి.. 2 లక్షల రూపాయల పైన ఉన్నవారికి షెడ్యూల్ విడుదల అవుతాది… పైన ఉన్న డబ్బులు చెల్లిస్తే ఆధి మాఫీ అవుతుంది. దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం ది, మేము ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు అమలు చేస్తున్నాం, ఆర్థిక విధ్వంసం జరిగింది కొన్ని పథకాలు జాప్యం జరిగింది. మేము ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తామని, హుస్నాబాద్ ప్రజలకు ధన్యవాదాలు నన్ను ఎమ్మెల్యే గా గెలిపించిన మీ అందరికీ అండగా ఉంటా.. హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో ముందుచుతా..ఇప్పటికీ దాదాపు వెయ్యి కోట్లకు పైగా నిధులు హుస్నాబాద్ లో వివిధ పనుల అభివృద్ధికి విడుదల చేశామని అన్నారు

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *