సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మూడు దశాబ్దాల గురు శిష్యుల బంధానికి నాటి విద్యార్థుల చిన్నారి స్నేహానికి చిరునామాగా నిలిచింది స్థానిక శుభం గార్డెన్స్ లో జెడ్పీహెచ్ఎస్ హుస్నాబాద్ పాఠశాలలో 1993-1994 ఎస్ ఎస్ సి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసుకున్న “పూర్వ విద్యార్థుల సమ్మేళనం”
వారి 10 వ తరగతి పూర్తి అయి 30 సంవత్సరాలు పూర్తి అయిన సంధర్భంగ 30 వసంతాల వేడుకను నిర్వహించారు ఈ సందర్భంగ వారికి విద్యా బుద్దులు నేర్పిన నాటి గురువులను ఈ వేడుకకు పిలుచుకొని నాటి వారి సేవలను కొనియాడారు, మరణించిన తమ గురువులు, స్నేహితులకు శ్రద్దాంజలి ఘటించదాంతో మొదలైన కార్యక్రమంలో గురువుల అమూల్యమైన సందేశాలను క్రమశిక్షణతో విని వారిని గౌరవంగ సత్కరించికొని, జ్ణాపికలు అందజేసి వారి ఆశీర్వాదాలు పొంది ఆనందంగ గురువులను వారి ఇళ్ళకు సాగనంపారు. క్షీణించిన గురువుల ఆరోగ్యాలను చూసి చలించిపోయారు. వారు పంచిన జ్ణానంతోనే ఈ రోజు ఈ స్థాయిల్లో ఉన్నామని గుర్తు చేసుకున్నారు.








ఆ పై తమ చిన్ననాటి స్నేహితులతో కబుర్లు, ఆట పాటలతో సాంస్కృతిక కార్యక్రమాల్లో మునిగి తేలి పసిపిల్లల్లాగ మురిసిపోయారు. ఈ సందర్భంగ తామంత ఐక్యంగ ఉంటు కష్ట సుఖాల్లో ఒకరికొకరు సహాకారం అందించుకుంటు సామాజిక సేవలో ముందుకు సాగాలని తీర్మానించుకున్నారు.