హుస్నాబాద్ పట్టణ రోడ్డు వెడల్పు లో భాగంగా నష్టపోతున్న బాధితులను ఆదుకోవాలి!!!
బిసి సంక్షేమ సంఘం నియోజకవర్గ కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం మెయిన్ రోడ్ గుండా వెళ్లే జాతీయ రహదారి వెడల్పు చేసే కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న నష్టాన్ని గురువారం హుస్నాబాద్ నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘ కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పట్టణంలో 100 ఫీట్ల రోడ్ తో వెడల్పు చేయడం వల్ల సొంత భవన యజమానులు, పట్టణ మెయిన్ రోడ్ లో కిరాయికి ఉండి వివిధ వ్యాపారాలు చేసుకునే వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కిరాయికి ఉండి వ్యాపారం చేసుకునే చిరు వ్యాపాస్తులు, మధ్య తరగతికి సంబంధించిన వారు ఫైనాన్సు కిస్తీలు, ఆర్థిక ఇన్స్టాల్మెంట్లు, ప్రతి నెల కట్టే పరిస్థితి ఉంటుంది. వ్యాపారం నడవకపోయినా కిరాయిలు తప్పక యజమాన్యానికి కట్టవలసిన పరిస్థితి ఉంటుంది. ఇట్టి రహదారి వెడల్పుతో పది(10) నుండి 15 ఫీట్లు సెట్ బ్యాక్ కావలసి వస్తుంది. కొందరికి భవనాలు పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కొందరికి 10 ఫీట్ల షెటర్లు ఉంటే అవి పూర్తిగా పోయే పరిస్థితి తయారయింది. ఒక్కొక్కరికి లక్ష నుండి 40 లక్షల వరకు నష్టం వాటిల్లుతుంది. కొన్ని వ్యాపార కాంప్లెక్స్ లు, మరియు చౌరస్తాల వద్ద నాలుగు పక్కలకు 100 ఫీట్ల దూరం వరకు వెడల్పు చేయడం ద్వారా వారికి తీవ్ర నష్టం కలిగే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇట్టి భవనముల ముందున్న బోర్లు రోడ్డు వెడల్పులో పోవడం జరుగుతుంది. ముందు వర్షాకాలం కావడం వల్ల వరద నీరు ఇట్టి భవనాలలోకి చొచ్చుకుని వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. పట్టణంలో ఇట్టి పనులు నాలుగు నెలలు నడిచే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇట్టి నష్టాలకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అయినా పొన్నం ప్రభాకర్ & ఎంపీ బండి సంజయ్ బాధితులకు ఆర్థికంగా న్యాయం చేయవలసిన అవసరం ఉందని, వారి యొక్క వ్యాపారాలు దెబ్బతింటాయి కాబట్టి వివిధ ఫైనాన్స్ సంస్థలు వారిని వేదించకుండా ఆదుకోవాల్సిన బాధ్యత ఇక్కడి ఎంపి, మంత్రి పైన ఉందని హుస్నాబాద్ పట్టణ ప్రజల పక్షాన కోరడం జరుగుతుంది అని అన్నారు. బాధితులకు న్యాయం చేయకపోతే ఆందోళనకు సిద్ధమని ఈ సందర్భంగా హెచ్చరించారు.

