రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయిన హుస్నాబాద్ విద్యార్థులు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలుర) హుస్నాబాద్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయినట్లు పాఠశాల పిడి ఆర్ శ్రీనివాస్ తెలియజేశారు. ఈ నెల 3 వ తేదీ నుండి 5 వ తేదీ వరకు నారాయణ పేట్ జిల్లా కోస్గి గ్రామం లో పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి 17 సంవత్సరాల హ్యాండ్ బాల్ టోర్నమెంట్ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హుస్నాబాద్ (బాలుర) 10 వ తరగతి చదువుతున్న ఎం. శివ బాలాజీ బాలుర విభాగంలో ఉమ్మడి మెదక్ జిల్లా జట్టుకు, బాలికల విభాగంలో కె ప్రశాంత ఉమ్మడి మెదక్ జిల్లా జట్టుకు సెప్టెంబర్ 30 వ తేదీన హుస్నాబాద్ లో నిర్వహించిన మెదక్, సంగారెడ్డి మరియు సిద్దిపేట 3 జిల్లా ఎంపిక పోటీల లో అత్యంత ప్రతిభ ఆధారంగా వీరిని ఎంపిక చేసినట్లు పాఠశాల పిడి ఆర్ శ్రీనివాస్ తెలియజేశారు. విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయినందుకు మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ పర్సన్ ఐలేని అనిత శ్రీనివాస్ రెడ్డి, వార్డ్ కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్, MEO బండారి మనీలా, ప్రధానోపాధ్యాయులు కె వాసుదేవ రెడ్డి, పాఠశాల అమ్మ అధర్ష కమిటీ అధ్యక్షురాలు బెజ్జంకి వరలక్ష్మి మరియు ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.