రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన హుస్నాబాద్ విద్యార్థి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
మెదక్ స్టేడియంలో సోమవారం రోజు నిర్వహించిన 69వ ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ అథ్లెటిక్స్ పోటీలలో హుస్నాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర విభాగానికి చెందిన 10వ తరగతి విద్యార్థి గౌరవేని రీశ్వంత్ అద్భుత ప్రతిభ కనబరిచి, రెండు విభాగాల్లో ప్రతిభాపాటవం ప్రదర్శించాడు. రీశ్వంత్ 400 మీటర్ల పరుగు పందెంలో తృతీయ స్థానం సాధించగా, 100 మీటర్ల హర్డిల్స్ పరుగు పందెంలో ప్రథమ స్థానం సాధించి రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక అయ్యాడు. ఈ విజయాన్ని పురస్కరించుకుని పిడి ఆర్ శ్రీనివాస్ విద్యార్థి ప్రతిభను అభినందించారు. అలాగే ఎంఈఓ బండారి మానిలా, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. వాసుదేవ రెడ్డి, సీనియర్ క్రీడాకారులు కృష్ణ మరియు రాజేష్ రీశ్వంత్‌ను అభినందిస్తూ, రాష్ట్రస్థాయిలో కూడా హుస్నాబాద్ పేరు నిలబెట్టాలని ఆకాంక్షించారు. విద్యార్థి విజయంతో పాఠశాల సిబ్బంది, సహ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.
Posted inహుస్నాబాద్
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన హుస్నాబాద్ విద్యార్థి





