హుస్నాబాద్ రేణుకా ఎల్లమ్మ ఉత్సవాలు విజయవంతం చేయాలి
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టాలి
అధికారులు, ఉత్సవ కమిటీ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ లో శ్రీ రేణుకా ఎల్లమ్మ ఉత్సవాలు ఈరోజు కళ్యాణం నుండి ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 11 వ తేదీ వరకు నెల రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.కొత్తగా ఎన్నికైన ఉత్సవ కమిటీ సభ్యులను మంత్రి పొన్నం ప్రభాకర్ సత్కరించారు.

ఈరోజు శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మహాముని కళ్యాణం ఘట్టం ముగిసింది. రేపటి నుండి భక్తులు అమ్మవారిని బోనాలు, ఒడిబియ్యం, ఆలయం వద్ద మొక్కలు చెల్లించుకొని వంటలు చేసుకుంటారు. వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఒక ఎంట్రీ క్యూలైన్ , ఒకటి ఔట్ లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు.
అధికారులు ప్రోటోకాల్, బారికేడ్లు,భక్తులకు తాగునీటి ఏర్పాట్లు, శానిటేషన్, పట్టణంలో విద్యుత్ అలంకరణ, పార్కింగ్, లా అండ్ ఆర్డర్ సమస్య లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా ఏర్పడిన దేవాలయ ఉత్సవ కమిటీ నీ మూడు టీం లుగా ఏర్పాటు చేసి ఆరు గంటల చొప్పున పని విభజన చేసుకోవాలని సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, ఆలయ ఈవో, ఆర్డీవో, ఎమ్మార్వో , మున్సిపల్ కమిషనర్, పోలీస్ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.





