తమిళనాడు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ము స్ట్రాంగ్ మృతికి కొవ్వొత్తులతో ఘనంగా నివాళులు అర్పించిన హుస్నాబాద్ బీఎస్పీ నాయకులు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
శనివారం హుస్నాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద తమిళనాడు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్ స్ట్రాంగ్ ని గుర్తు తెలియని వ్యక్తులు చంపడం పట్ల హుస్నాబాద్ బీఎస్పీ పార్టీ పక్షాన నియోజకవర్గ ఇన్చార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రశ్నించే గొంతులను అణిచివేయడం చంపివేయడం ప్రభుత్వాలకు మామూలు అయిపోయిందని, కారణాలు, సాక్షాలు లేకుండానే సంవత్సరాల తరబడి జైలు లో వేయడం, అదేవిధంగా దేశంలో సుపారి హత్యలు మామూలు అయిపోయాయని, భద్రత, శాంతి లేని ప్రజాస్వామ్య దేశంగా మారిపోయింది అని అన్నారు. గతంలో కూడా ఢిల్లీలో ప్రముఖ లాయర్ ను చంపడం, తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రముఖ లాయర్ను చంపడంజరిగిందని అన్నారు. న్యాయవాదులను భయపెట్టేందుకు దేశంలో హత్య రాజకీయాలు చేస్తున్నారని, ఇటువంటి హత్యలను దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఖండించవలసిన అవసరం ఉన్నది అని అన్నారు. వెంటనే ఇట్టి విషయంలో దోషులను అరెస్టు చేసి ఉరిశిక్ష అమలు చేయాలని బి ఎస్.పి పార్టీ పక్షాన కోరారు.
ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ బి ఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్, బీఎస్పీ పార్టీ జిల్లా నాయకులు డేగల వెంకటేశ్వర్లు, సుధాకర్, ఎలగందుల శంకర్, నియోజకవర్గ అధ్యక్షులు వేల్పుల రాజు, శరత్, జేరి పోతుల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.