సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఎల్లమ్మ గుడి దగ్గర నివసించే వడ్డెర సంఘానికి చెందిన ఇరగ దిండ్ల రమేష్ / బాలయ్య ఇటీవలే మృతి చెందాడు. వారి కుటుంబానికి వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల వెంకటేష్ మరియు కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ మండల అధ్యక్షులు బంక చందు, అక్కన్నపేట వడ్డెర సంఘం మండల అధ్యక్షులు ఇరగ దిండ్ల కుమార్, గొల్లెన ప్రశాంత్ కస్తూరి శీను, గొల్లేని రవి, గొల్లేని సమ్మయ్య తో కలిసి ఇరగ దిండ్ల రమేష్ కుటుంబాన్ని పరామర్శించి, వారికి 50 కిలోల బియ్యం మానవతా సహాయంగా అందజేశారు. అలాగే ఆ కుటుంబానికి ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.