ఓవైసీ పై చర్యలు తీసుకోవాలని సీపీకి హిందూ వాహిని వినతి
సిద్దిపేట టైమ్స్ సిద్దిపేట ప్రతినిధి:
పార్లమెంట్ లో అసదుద్దీన్ ఓవైసీ తన ప్రమాణ స్వీకారం సందర్భంగా ‘జై పాలస్తీనా’ అని నినాదం చేసి మన దేశం యొక్క సమగ్రతను, ఐక్యతను, విదేశీ సంబంధాలను దెబ్బతీసే విధంగా మాట్లాడినందుకు నిరసనగా ఓ వైసీ పై చర్యలు తీసుకోవాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ కు హిందూ వాహిని ఆధ్వర్యంలో మెమొరండం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఓవైసీ పై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని జిల్లా అధ్యక్షులు బస్వరాజు సత్యం, రాష్ట్ర సంపర్క సహప్రముఖ్ కస్తూరి భూమి రెడ్డి(అడ్వకేట్), రాష్ట్ర బోధన సహప్రముఖ్ చల్ల బాల్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బండి కిరణ్, జిల్లా విధిప్రముఖ్ ప్రదీప్, రాజేష్, పి. శ్రీకాంత్, వేణుగోపాల చారి, దోనే అశోక్, వి. రవీందర్, మనోహర్ రెడ్డి, కార్తీక్, శివ, శంకర్, వి. రాజేశం పాల్గొన్నారు.