నిన్నటి త్యాగాలకు వారసుడు, రేపటి తరానికి మార్గదర్శకులు..రాహుల్ గాంధీ..!
హుస్నాబాద్ పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
భారతదేశాన్ని ప్రగతిశీల భవిష్యత్తు వైపు నడిపించగలిగే ఏకైక వ్యక్తి, నవ యువ నాయకుడు కాంగ్రెస్ ఆగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ లో టీమ్ పొన్నం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
అక్కు శ్రీనివాస్ మాట్లాడుతూ…ఇందిరాగాంధీ మనవడు యువ నాయకుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా ఆయన స్ఫూర్తితో అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు. వారసత్వ రాజకీయాలకు స్వస్తి చెప్పి కాంగ్రెస్ లో యువ నాయకులను ప్రోత్సహించి యూత్ కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పారని అన్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా పాదయాత్ర చేసి ప్రజలతో కలిసిపోయి మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తన మార్కు చూపించారని, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేతృత్వంలో అధికారంలోకి వస్తుందని అన్నారు. ప్రజలంతా కాంగ్రెస్ పక్షాన ఉన్నారని, రాహుల్ గాంధీ స్ఫూర్తితో రాష్ట్రంలో యువనాయకులైన రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, స్థానిక ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు. ఇటు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమం లో పూదరి హరీష్, జూనోజు శ్రీకాంత్, దొంతరవేని శ్రీనివాస్, సావుల వెంకట్, బొప్పిషెట్టి భీమేష్, సర్వర్, సుమన్ అఖిల్, రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.