సీపీ విజయ్ కుమార్ పేరు వింటే హడల్..  ఒత్తిళ్లలను లెక్కచేయకుండా ముక్కుసూటిగా..  ప్రశంసలు అందుకుంటున్న సిద్దిపేట సీపీ..

సీపీ విజయ్ కుమార్ పేరు వింటే హడల్..  ఒత్తిళ్లలను లెక్కచేయకుండా ముక్కుసూటిగా..  ప్రశంసలు అందుకుంటున్న సిద్దిపేట సీపీ..

సీపీ విజయ్ కుమార్ పేరు వింటే హడల్..
ఒత్తిళ్లలను లెక్కచేయకుండా ముక్కుసూటిగా..
ప్రశంసలు అందుకుంటున్న సిద్దిపేట సీపీ..

సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట ప్రతినిధి

రాజకీయ నేతలు, ఉన్నతాధికారుల ఒత్తిళ్లు ఉన్నా.. కొంత మంది ఆఫీసర్లు తమ పని తాము చేసుకొని పోతుంటారు. విధుల్లో తన, మన అనే భేదాన్ని చూపించకుండా.. తప్పు ఎవరు చేసినా ఒకేలా స్పందిస్తారు. అలాంటి కోవకు చెందినవారే సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్. సిద్దిపేట పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన నుండి అక్రమార్కులను హడలెత్తిస్తున్నారు. అదే స్థాయిలో అధికారుల్లో గుబులు రేపుతున్నారు. ఈ మధ్య జిల్లా లో జరిగిన పలు కీలక కేసుల్లో విజయ్ కుమార్ తనదైన శైలిలో వ్యవరించారు. ప్రభుత్వ అధికారులంటే ఆయనలా పనిచేయాలంటూ ప్రజలనుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. విజయ్ కుమార్ గురించి మరిన్ని ఆసక్తికర వివరాలు..

యం ఎస్ విజయ్ కుమార్ సిద్దిపేట సీపీ గా బాధ్యతలు చేపట్టినప్పటినుండి సిద్దిపేటలో క్రమశిక్షణ వాతావరణం నెలకొంది. రాజకీయ నేతలు ఉన్నతాధికారుల ఒత్తిళ్లలను లెక్కచేయకుండా ముక్కుసూటిగా విధులు నిర్వర్తించడం పోలీస్ కమిషనర్   విజయకుమార్ నైజం.. తాను ఇక్కడ పనిచేస్తున్న విధుల్లో నిక్కచ్చిగా వ్యవరిస్తున్నారు.  2024 ఫిబ్రవరి లో  వెస్ట్ జోన్ డీసీపీ గా పనిచేస్తున్నప్పుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న 72మంది పోలీస్ అధికారులను ఏక కాలం లో బదిలీ చేసి రికార్డ్ సృష్టించిన విజయ్ కుమార్.  సిద్దిపేట సీపీ గా వస్తున్నారన్న సమాచారం తెలియగానే జిల్లాలో పని చేస్తున్న కానిస్టేబులు మొదలుకొని ఉన్నత అధికారి వరకు తమ పాత వ్యవహార శైలిని మార్చుకునేందుకు  ప్రయత్నలు మొదలు పెట్టారు.
పోలీస్ కమిషనర్ గా విజయ్ కుమార్ అధికార బాధ్యత లు చెప్పటిన్నపటి నుంచి  జిల్లాలో బెల్ట్ షాపులు, ఇసుక అక్రమ రవాణా, గంజాయి, మత్తు పదార్థాలు, రేషన్ బియ్యం, ఆన్లైన్ బెట్టింగ్, డ్రగ్స్, మైనర్ డ్రైవింగ్, ట్రాఫిక్ సిగ్నల్స్, పేకాట, జూదం, వడ్డీ వ్యాపారులు, ఫైనాన్స్, లోన్ యాప్, బెట్టింగుల పై ప్రత్యేక ద్రుష్టి సరించారు. ఈ క్రమము లోనే సిద్దిపేట సీటీజెన్స్ క్లబ్ పై రైడ్ చేయించి పేకాట ఆడుతున్న 50 మందిని అదుపులో తీసుకుని గేమెంగ్ కేస్ నమోదు చేసి సిద్దిపేట జిల్లా లో మరింత పాపులర్ అయ్యారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే జైలుకే..

సిద్దిపేట జిల్లాలో పోలీస్ కమిషనర్ గా విజయ్ కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మద్యం సేవించి వాహనాలు నడిపించాలంటే మద్యం ప్రియులు జంకుతున్నారు. జిల్లాలో ఎక్కడ చూసినా దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.  మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి పదివేల జరిమానా విధిస్తూ  పాలసీని పక్కడబందిగా
అమలు చేస్తున్నారు. దినితో మద్యం తాగాలంటేనే భయపడుతున్నారు. ఈ విషయం
పై పక్క జిల్లాల ప్రజలు సైతం చర్చిస్తున్నారు. ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే పదివేల రూపాయల జరిమానా, జైలు శిక్ష తప్పదు అంటూ చర్చ సాగుతుంది. ఈ విషయం జనాల్లోకి చొచ్చుకు వెళ్ళింది. మద్యం సేవించాలంటేనే భయపడుతున్నారు జనాలు.

సిద్దిపేట సిటిజెన్స్ క్లబ్ పై దాడితో మరింత పాపులర్ అయిన సీపీ విజయ్ కుమార్..

సిద్దిపేట పట్టణ నడిబొడ్డున వున్న సిటిజన్స్ క్లబ్ లో పేకాట గత కోనేళ్లుగా పేకాట జోరుగా సాగుతుంది. అనేక కుటుంబాలు పేకాట వల్ల ఆర్థికంగా దెబ్బతిని రోడ్డున పడ్డాయి. అయితే మొన్నటి వరకు ఉన్న పోలీసు అధికారులు పేకాట క్లబ్ వైపు చూసి చుడన్నట్లు వ్యవహరించేవారు. దీనికి అనేక అనుమానాలకు తవిస్తుంది. అయితే విజయ్ కుమార్ సీపీ గా బాధ్యత లు చేపట్టిన కొన్ని రోజులలోనే అయన ఆదేశాల మేరకు టాస్క్ పోర్స్ పోలిసులు క్లబ్ పై  మెరుపు దాడి చేసి పేకాట ఆడుతున్న 50 మందిని అదుపులోకి తీసుకోని కాయిన్స్ స్వాధీణం చేసుకున్నారు. గేమింగ్ కేసు నమోదు చేశారు.  క్లబ్ పై దాడి విషయంలో ఎన్ని వత్తిళ్లు వచ్చినప్పటికి వినకుండా కేసు నమోదు చేయీంచిన సీపీ విజయ్ కుమార్ పై ప్రజలు  ప్రశంసలు కురిపేస్తున్నారు.

సామాన్యులకు సైతం అందుబాటులో..

గతంలో సిద్దిపేట పోలీస్ కమీషనర్ గా పని చేసినవారు ఎవరుకూడా ప్రజలకు నేరుగా కలిసిన దాఖలలు లేవు. కానీ ప్రస్తుత సీపీ విజయ్ కుమార్ మాత్రం సామాన్య ప్రజలకు అందుబాటులో వుంటున్నారు. వారి సమస్యలను ఓపికగా వింటున్నారు. వినడమే కాదు.. సమస్య పరిష్కారానికి దారి చూపుతున్నారు. దీనితో ఇపుడు జిల్లాలోని ప్రజలందరూ ఎ సమస్య వున్నా కామెషనరెట్ వైపు పరుగులు పెడుతున్నారు. సమస్యలు సీపీ కి విన్నావించు కుటున్నారు. దీనితో పోలీస్ కమిషనరెట్ ప్రజలతో కిటకిటలాడుతుంది.

రాజకీయ నాయకులకు సున్నితంగా హెచ్చరిక..

జిల్లాలో రాజకీయ నేతలు పలు సమస్యలలో కల్పించుకొని ముందుకు వస్తే వారికి సున్నితంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాజకీయ నేతలు తమ పని తాము చేసుకోవాలని పోలీసుల పనులు పోలీసులు చేసుకుంటారని నిక్కచ్చిగా స్పష్టం చేస్తున్నారు. సిద్దిపేట పట్టణంలోని సిటీ జన్స్ క్లబ్ ఫై దాడి చేసిన సందర్భంలో వివిధ రాజకీయ నేతలు కల్పించుకుని ఫోన్ చేసిన వారిని  సున్నితంగానే హెచ్చరించినట్లు తెలుస్తుంది. సిద్దిపేట కు చెందిన టిఆర్ఎస్ పార్టీ రాజకీయ నాయకునికి పలు సందర్భాలలో కల్పించుకుని ముందుకు వస్తే సున్నితంగా హెచ్చరించి తిరస్కరించినట్లు తెలుస్తుంది.

సామాన్యుడిలా.. నేరుగా..

సిద్దిపేట పట్టణంలో పలు కాలనీలలో బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు వివాద ప్రాంతాల వద్దకు.. పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ సామాన్యుడిలా.. నేరుగా.. టూవీలర్ వాహనంపై హెల్మెట్ పెట్టుకుని వెళ్తున్నారట.. కొన్ని ప్రాంతాల్లో తానే స్వయంగా పర్యటించి సమస్యలు పరిశీలిస్తున్నారు. పట్టణంలో ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరు ఏం చేస్తున్నారు.. అని స్వయంగా పరిశీలిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం వాకింగ్ చేస్తూ గ్రామాలను సందర్శిస్తూ గ్రామాలలో ఉన్న వృద్ధులు, సామాన్య ప్రజలును మాట్లాడిస్తూ.. పోలీసుల పనితీరు, ప్రజల సమస్యలను, మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిగే అనర్థాలను చర్చిస్తున్నారు..
ఈ విషయం ప్రజల్లోకి వెళ్లడంతో పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ పనితీరును ప్రశంసిస్తున్నారు.

చట్టానికి ఎవరూ అతిథులు కాదు..
సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్

చట్టాన్ని ఎవరూ అతిక్రమించినా చర్యలు తప్పవని, సామాన్యుడి నుండి ఎంతటి పెద్ద వారికైనా వర్తిస్తుంది. పోలీస్ స్టేషన్ కి వచ్చేవారి సమస్యలు ఓపిక గా విని  కేసు నమోదు చేసి రసీదు ఇవ్వాలి.  తన వద్ద కు సమస్యలపై వచ్చే ప్రజలు నేరుగా వచ్చి కలవవచ్చు.   పోలీసులు  న్యాయం ఉన్న వారి వైపు ఉండాలి. జిల్లా లో ఎక్కడ అక్రమాలు, అన్యాయాలు జరిగినా నేరుగా తన దృష్టి కి తేవాలని ప్రజలకు సూచించారు.

ప్రొఫైల్..

కర్ణాటక లోని మండ్య జిల్లా సాసులు  గ్రామం లో ఎస్ఎం విజయ్ కుమార్ జన్మించారు. విద్యాబ్యాసం గ్రామం లోని స్కూల్ , అనంతరం నవోదయ స్కూల్ లో సాగింది. బి. టెక్  మైసూర్ లో పూర్తి చేశారు. మూడో ప్రయత్నం లో 2012లో ఐపిఎస్ గా సెలెక్ట్ అయ్యారు. తొలి పోస్టింగ్    మంచిర్యాల ఏ ఎస్పీగా, తర్వాత గద్వాల్ ఎస్పీ, డీసీపీ ట్రాఫిక్, తర్వాత ఇంటెలెజెన్స్ లో అక్కడి నుండి  వెస్ట్ జోన్ డీసీపీ ప్రస్తుతం,   సిద్దిపేట కమీషనర్ అఫ్ పోలీస్ గా విధులు నిర్వహిస్తున్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *