హుస్నాబాద్ లో ప్రారంభమైన “స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్” ఆరోగ్య శిబిరం
ప్రతిరోజూ 8 వైద్య శిబిరాలు – జిల్లా వ్యాప్తంగా 12 రోజులపాటు నిర్వహణ
మహిళలకు 14 రకాల ప్రత్యేక వైద్య సేవలు.. పోషకాహారం, రక్తదానం, అవయవదానం పై అవగాహన
జిల్లా వ్యాప్తంగా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ హైమావతి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మహిళల ఆరోగ్య సాధికారత కోసం “స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ – ఆరోగ్యవంతమైన మహిళ, బలమైన కుటుంబానికి పునాది” పేరుతో గల జాతీయ స్థాయి ఆరోగ్య కార్యక్రమాన్ని హుస్నాబాద్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ కె.హైమావతి ఐఏఎస్, అదనపు కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఈ నెల 17 నుండి అక్టోబర్ 2 వరకు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, బస్తి దవఖానాల్లో, AAM, CHCs, etc (మహిళలకు, కుమార దశ బాలికలకు ) మెడికల్ క్యాంపులు, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, నిర్వహించడం, ప్రతిరోజు 8 వైద్య శిబిరాలను( మెడికల్ క్యాంప్స్ ), 12 రోజులు( సెలవులు మినహాయించి ) నిర్వహిస్తారని తెలిపారు. ఈ ఆరోగ్య శిబిరాల్లో ప్రత్యేకమైన వైద్య నిపునులచే జనరల్ మెడిసిన్, గైనకాలజిస్ట్, ఆప్తాల లిస్ట్, దంత వైద్యులు, చెవి ముక్కు గొంతు, చర్మవ్యాధుల, మానసిక వైద్య నిపుణులు ద్వారా 14 రకాల ఆరోగ్య సేవలు అందిస్తారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ….
మహిళలు ఆరోగ్యం గూర్చి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరెవరికి ఎలాంటి సమస్య ఉందో ఆసుపత్రికి వెళ్ళేవరకు తెలియదు చిన్న చిన్న సమస్య ఉంటే ఇంతే కదా అని నిర్లక్షం చేసుకుంటే వెళ్తారు. ఆసుపత్రికి వెళ్తే గానీ తెలియదు. వైద్య ఆరోగ్య శాఖ తో పాటు జిల్లా విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ వారి సమన్వయంతో షెడ్యూల్ ప్రకారం 8 రకాల చికిత్సలు చేయబడతాయి. అందరూ మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలనీ మీ మీ ఆరోగ్యాన్ని గూర్చి స్పెషలిస్ట్ డాక్టర్ లకు తెలిపే ఆరోగ్యవంతమైన జిల్లాగా మార్చాలని తెలిపారు. గతం లో శారీరక శ్రమ ఎక్కువగా ఉండేవి కావున జబ్బు పడేవారు కాదు. 90% ఆహారం ద్వారానే రోగాలు వస్తాయి. మన ఆహారంలో కెమికల్ తో కూడిన వాడకూడదని కెమికల్ ఆహారాన్ని వాడడం ద్వారా శక్తి హీనులు అవుతున్నారు. డాక్టర్ లు కొంత వరకు మాత్రమే చికిత్స అందిస్తారు. మంచి ఆహారం ద్వారా అసలు రోగాలు మన వద్దకు రాకుండా చూసుకోవచ్చు. ప్రకృతి లో మునగాకు, పప్పులు, ఆకు కూరలు, మనవద్దే పండించి సమ పాళ్లలో తీసుకోవాలనీ సూచించారు. ఈ సదవకాశాన్ని జిల్లాలోని ప్రజలు వినియోగించుకోవాలని తద్వారా మహిళల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం ద్వారా తను స్వశక్తిగా జీవనం సాగిస్తూ శక్తివంతమైన కుటుంబం, తద్వారా రాష్ట్ర, దేశ అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు.
జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ….
మహిళలు ఇంట్లో కుటుంబ సభ్యులను చూసుకుంటారు. కానీ వారి హెల్త్ ఎవరు చూసుకోరు అలాంటి మహిళలకు హెల్త్ చెకప్ చేసుకోవాలి. ఒక కుటుంబంలో మహిళా ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యం గూర్చి అత్యంత జాగ్రత్తగా ఉండాలి. షెడ్యూల్ ప్రకారం ఆయా కేంద్రాల్లో స్పెషలిస్ట్ డాక్టర్ లు అందుబాటులో ఉంటారు. ఆశా వర్కర్ లు మీ గ్రామాల్లో మహిళలను పిఎచ్ సి వచ్చేలా ప్రచారం చెయ్యాలి. ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని ఫ్యామిలీ మరియు ఇతర కుటుంబ సభ్యులకు తెలిపి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ ఆరోగ్యాన్ని చెక్ చేసుకోవాలని తెలిపారు.
అనంతరం హాస్పిటల్ లో అందరితో కలిసి ఆయా వైద్య శిబిరాలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ధనరాజ్, డి సి ఎచ్ ఓ అన్నపూర్ణ, ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆనంద్, హాస్పిటల్ సూపరిండెంట్ రమేష్ రెడ్డి, స్పెషలిస్ట్ డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.






