అక్కనపేటలో స్వస్థ నారి–సశక్త పరివార్ అభియాన్ లో భాగంగా హెల్త్ క్యాంప్
సిద్దిపేట టైమ్స్ అక్కనపేట:

“స్వస్థ నారి – సశక్త పరివార్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా అక్కనపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) లో అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ పర్యవేక్షణలో ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 8 మంది వైద్య నిపుణలు సేవలు అందించారు. ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ డా. శ్రీనివాస్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ శిబిరంలో ప్రజలకు వివిధ విభాగాల వైద్య పరీక్షలు నిర్వహించారు. అదే విధంగా పంచాయతీ శానిటేషన్ కార్మికుల కోసం కూడా ప్రత్యేక మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి, వారికి అవసరమైన పరీక్షలు, ఔషధాలు అందజేశారు. కార్మికుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వివిధ వ్యాధుల పరీక్షలు నిర్వహించారు. అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ మాట్లాడుతూ, “స్వస్థ నారి – సశక్త కుటుంబం” కార్యక్రమం ఉద్దేశ్యం మహిళా ఆరోగ్యాన్ని కాపాడడం, కుటుంబం మొత్తం ఆరోగ్యవంతంగా ఉండేలా చూడడమే అని తెలిపారు. అలాగే శానిటేషన్ కార్మికులు ప్రతిరోజూ కష్టపడి పనిచేస్తూ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని, వారికి తరచూ ఆరోగ్య పరీక్షలు చాలా అవసరమని అన్నారు. ఈ హెల్త్ క్యాంప్‌లో స్థానిక ప్రజలు, శానిటేషన్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలు పొందారు.





