ఏసీబీ వలలో హవేలీ ఘనపూర్ ఎస్ఐ..
లంచం తీసుకుంటూ పట్టు బడ్డ ఎస్ఐ ఆనంద్ గౌడ్.
సిద్దిపేట టైమ్స్: మెదక్ ప్రత్యేక ప్రతినిధి:
మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ యస్ ఐ అనంద్ గౌడ్ సీజ్ అయిన ఇసుక టిప్పర్ రిలీజ్ కోసం యస్ ఐ ఆనంద్ గౌడ్ డబ్బులు డిమాండ్ చేయడం తో సదరు బాధితుడు పూల గంగాధర్ ఏసీబీ అధికారుల ను ఆశ్రయించడం తో సోమవారం ఏసీబీ అధికారులు వల పన్ని పట్టు కున్నారు. పోలీస్ స్టేషన్ లో యస్ ఐ లంచం తీసుకుంతుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు దొరికి పోయారు.హవేలీ ఘనపూర్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.