రాజీనామాకు హరీష్ రావు సిద్ధంగా ఉండాలి..
2 లక్షల రుణ మాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు..
కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ నాయిని నరసింహారెడ్డి..
సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట ప్రతినిధి:
రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్న హరీష్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ నాయిని నరసింహారెడ్డి అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఒక్కొక్క హామీని నెరవేరుస్తున్నారని తెలిపారు. తెలంగాణ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల వరకు ఏకకాల రుణమాఫీ చేస్తామని ప్రకటించినందుకు సిఎం కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని రకాల చర్యలు చేపడుతున్నారన్నారు. ఎన్నికలకు ముందు అన్న ప్రకారం రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చలేక పోయింది అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో 4 గ్యారంటీలను అమలుపరచిందన్నారు. ఇకనైనా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీపై అవాకులు చవాకులు మాట్లాడడం మానుకోవాలి హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మహిపాల్ రెడ్డి, రాజేశం గౌడ్, సత్యనారాయణ, రాజిరెడ్డి, రాజు ,శేఖర్ ,కృష్ణారెడ్డి, ఎల్లారెడ్డి, కనకయ్య, సురేందర్, రెడ్డి రాజు, బాబేష్ ,జనార్దన్ రెడ్డి, పలువురు పాల్గొన్నారు.