ఈడి సోదాలపై స్పందించిన హరీష్ రావు..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఈడీ, ఐటీ దాడులతో వేదిస్తున్నారు..

ఈడి సోదాలపై స్పందించిన హరీష్ రావు..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఈడీ, ఐటీ దాడులతో వేదిస్తున్నారు..

ఈడి సోదాలపై స్పందించిన హరీష్ రావు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఈడీ, ఐటీ దాడులతో వేదిస్తున్నారు..

సిద్దిపేట టైమ్స, పటాన్చెరు

పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో జరిగిన ఈడీ, ఐటి సోదాల పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. అధికారుంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఈడీ,ఐటీ దాడులతో వేదిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఏలాంటి అవినీతి ఆస్తులు దొరకలేదని, బిఆర్ఎస్ ఎమ్మెల్యే లను భయపెట్టి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారని విమర్శించారు.

మహీపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇంటికి శుక్ర వారం మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వేల్లారు. ఈ సందర్భంగా ఈడి తనిఖీల వివరాలు హరీష్ రావు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. బీహార్, గుజరాత్ లలో నీట్  ప్రశ్నాపత్రాలను అమ్ముకున్నారని, ప్రశ్నాపత్రాలు లీకవుతున్నా అక్కడ ఈడీ అధికారులు ఎందుకు వారిపై దాడులు చేయటం లేదని, మన రాష్ట్రంలో లక్ష కుటుంబాలు నీట్ పరీక్ష వ్రాశారు, వారిభవిష్యత్తు అయోమంలో ఉంది అని ప్రశ్నిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ ఎమ్మెల్యే లను ఒత్తిడికి గురిచేస్తుందని, బిఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లు చుట్టూ తిరుగుతూ.. అధికారపార్టీ బెదిరింపు ధోరణినికి పాల్పడుతున్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చాలా ధైర్యంగా ఉన్నారని, వారు ఏలాంటి తప్పు చేయలేదన్నారు. ఈడికి ఏలాంటి అక్రమ ఆస్తులు దొరకలేదన్నారు. ఇంట్లో చిన్న పిల్లలు ఏడుస్తున్నా కర్కశంగా ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ దాడులు చేయటం దారుణమన్నారు. మాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, ధర్మం గెలుస్తుందని భరోసా వ్యక్తపరిచారు. హరీష్ వేంట జిల్లా పరిషత్ చైర్మెన్ మంజుశ్రీ, ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మాణిక్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, తో పాటు వంటేరు ప్రతాప్ రెడ్డి,
మాజీ ఎమ్మెల్యే క్రాంతి కుమార్ తదితరులు ఉన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *