పాలన చేత కాకపోతే రేవంత్ రెడ్డి దిగిపో..  -మాజీ మంత్రి హరీష్ రావు..

పాలన చేత కాకపోతే రేవంత్ రెడ్డి దిగిపో..  -మాజీ మంత్రి హరీష్ రావు..

పాలన చేత కాకపోతే రేవంత్ రెడ్డి దిగిపో హితవు పలికిన హరీష్ రావు..
రేవంత్ రెడ్డి ఎక్కితే విమానం.. దిగితే విమానం..
43 సార్లు డిల్లీ వెళ్ళి ఏం సాధించావు..

సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట ప్రతినిధి; మే 07

రేవంత్ రెడ్డి అప్పులు పుట్టడం లేదని మాట్లాడవడం సీఎం గా పెయిల్ అయ్యావు. పాలన చేత కాకపోతే రేవంత్ రెడ్డి నవ్వు
దిగిపో అని మాజీ మంత్రి హరీష్ రావు హితవు పలికారు.
బుధవారం సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడ్ లోని ఐకేపీ సెంటర్ లో వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యం ను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశించారు. జిల్లా కలెక్టర్, ఆర్డివో, సివిల్ సప్లై అధికారులతో ఫోన్ లో హరీష్ రావు మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వడ్ల కొనుగోలు లో పూర్తిగా విఫలం అయిందని, ములుగే నక్కా పై తాటి పండు పడ్డట్టు రైతు పరిస్తితి ఉందని.. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనే దిక్కులేక రైతులు అవేదన చెందుతున్నారన్నారు. హైదరాబాద్ లో కూర్చొని రోజు అందాల పోటీలపై రేవంత్ రెడ్డి రివ్యూ లు చేస్తున్నాడని విమర్శించారు. అప్పులు తెచి పంట పండిస్తే కొనే దిక్కులేక పోయారని, గన్ని బ్యాగులు ఇచే పరిస్తితి లో ప్రభుత్వం లేదన్నారు. రేవంత్ రెడ్డి చిల్లర మాటలు తగ్గించి రైతులు పండించిన పంటను కొనుగోళ్ల పై దృష్టి పెట్టాలన్నారు. కేసీఆర్ ఉన్నపుడు ఎప్పుడూ వడ్ల కొనుగోలు లో ఇంత ఆలస్యం కాలేదన్నారు. ప్రభుత్వం రైతుల నుండి తరుగు పేరిట 5కేజిల వడ్లు కట్ చేస్తున్నారన్నారు.
మొలకెత్తిన కూడా కొనడం లెదని, రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు.. కొనుగోలు కేంద్రాల్లో తిరగాలన్నారు.
ఈ ప్రభుత్వం రైతుల ఉసూరు పోసుకుంటుందన్నారు. పాలన చేయకుంటే రేవంత్ రెడ్డి దిగిపోవాలని.. పంట దెబ్బతిన రైతులను ఆదుకోవాలన్నారు. రేవంత్ రెడ్డి ఎక్కితే విమానం.. దిగితే విమానం తప్ప ఇప్పటికే 43 సార్లు డిల్లీ వెళ్ళి ఏం సాధించారని ప్రశ్నించారు.
మంత్రులు గాలిమోటర్ల ప్రయాణాలు తప్ప చేసింది ఏం లేదన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *