హరీష్, సంతోష్ రావులు కుట్రలు చేస్తున్నారు..భవిష్యత్తులో కేటీఆర్, కేసీఆర్ లపై కుట్రలు..హరీష్ రావు ట్రబుల్ కాదు డబుల్ షూటర్..ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆరోపణలు..

హరీష్, సంతోష్ రావులు కుట్రలు చేస్తున్నారు..భవిష్యత్తులో కేటీఆర్, కేసీఆర్ లపై కుట్రలు..హరీష్ రావు ట్రబుల్ కాదు డబుల్ షూటర్..ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆరోపణలు..

హరీష్, సంతోష్ రావులు కుట్రలు చేస్తున్నారు..
భవిష్యత్తులో కేటీఆర్, కేసీఆర్ లపై కుట్రలు..
హరీష్ రావు ట్రబుల్ కాదు డబుల్ షూటర్..
ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆరోపణలు..

సిద్దిపేట టైమ్స్, బ్యూరో
హరీష్ రావు, సంతోష్ రావు లు కలిసి కుట్రలు చేస్తున్నారని కవిత తీవ్రమైన ఆరోపణలు చేశారు. బంగారం ఇంట్లో ఉంటే బంగారు తెలంగాణ కాదన్నారు. వీరిద్దరూ పార్టీని అస్తగతం చేయాలన్న కుట్రలో ఉన్నారని.. కేసీఆర్‌పై జరుగుతున్న అన్ని దాడులకు వీరే కారణం” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కవిత జూబ్లిహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు మాట్లాడుతూ..  తన ప్రవర్తన, పార్టీ వ్యతిరేక కార్యకలాపాల పేరుతో సస్పెండ్ చేయడం పూర్తిగా అన్యాయమని అన్నారు.

రేవంత్ తో హరీష్ స్నేహం..

సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఒకే విమానంలో ప్రయాణించారని.. రేవంత్ కాళ్లు హరీష్ రావు పట్టుకున్నాకే ఈ కుట్రలు మొదలయ్యాయి అని కవిత చెప్పుకొచ్చారు. లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని రేవంత్ అంటారు.. కానీ హరీష్‌పై మాత్రం మాట్లాడడం లేదని ఆరోపించారు.
“హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు, డబుల్ షూటర్”

కేసీఆర్‌పై సీబీఐ విచారణకు కారణం హరీష్ రావు, సంతోష్ రావన్నారు. టీడీపీ నుంచి బయటకు వస్తున్నప్పుడు కూడా హరీష్ రావు ప్రశ్నించాడని గుర్తు చేశారు. ఆయన ఎప్పుడూ కేసీఆర్ పక్కన నిలబడలేదని.. ఆయన ట్రబుల్ షూటర్ కాదు.. డబుల్ షూటర్ అన్నారు. కట్టప్ప లాగా ఉన్నాడని అంటారు కానీ నిజానికి తన పక్కన ఎమ్మెల్యేలను పెట్టుకోవాలని చూశాడని ఆరోపించారు. కేటిఆర్ ను ఓడించేందుకు కూడా హరీష్ రావు 80 లక్షలు పంపారని కవిత వ్యాఖ్యానించారు.

కేసీఆర్ వేళ్లు పట్టుకుని ఉద్యమాలు నేర్చుకున్నా..

జన్మనిచ్చిన తండ్రి కేసీఆర్ చిటికన వేలు పట్టుకుని ఉద్యమాలు చేయడం నేర్చుకున్నానని కవిత వ్యాఖ్యానించారు. కానీ ఇద్దరు పని గట్టుకుని నాపై విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను జైలు నుంచి వచ్చాక కూడా అనేక ప్రజా సమస్యలపై పోరాడానని గుర్తు చేశారు. అయినా పార్టీ నుంచి నన్ను బయటకు పంపించడం బాధాకరమని అన్నారు.

అంతే కాకుండా గురుకులాల్లో జరుగుతున్న అక్రమాలపై పోరాటం చేశానని.. బనకచర్ల సమస్యపై రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాను. సీఎం జిల్లాలో భూ నిర్వాసితుల కోసం అండగా నిలిచానని.. పెన్షన్లు పెంచాలని, ఆడబిడ్డలకు ఆర్థిక సాయం అందించాలని పోస్టుకార్డు ఉద్యమం చేశానన్నారు. 2024 నవంబర్ 23 నుంచి ఇప్పటివరకు 47 నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజా సమస్యలపై పోరాటం చేశానని ఆమె తెలిపారు. “ఇంత చేస్తే పార్టీ వ్యతిరేకమవుతానా?” అని అడిగారు.

నాపై కక్షగట్టారు..
“కేసీఆర్ కు కవిత రివర్స్ జలక్ – సంచలన నిర్ణయం..!?”
కవిత మాట్లాడుతూ.. 10 నెలల వ్యవధిలో 42 నియోజకవర్గాలు పర్యటించానని.. రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్నా స్పందించానన్నారు. కానీ పార్టీలో కొందరు తనపై కక్షగట్టారని చెప్పారు. సామాజిక తెలంగాణ కోసం కట్టుబడి పని చేయడం తప్పా? నేను ఏం తప్పుగా మాట్లాడాను? సామాజిక తెలంగాణ అంటే బీఆర్ఎస్ వ్యతిరేకమా? అని ప్రశ్నించారు.

కేటీఆర్‌కి సూటి ప్రశ్నలు..

కేటీఆర్‌ అన్నను గడ్డం పట్టుకొని, బుజ్జగించి అడుగుతున్నా.. ఒక చెల్లిని, మహిళా ఎమ్మెల్సీని.. తనపై కుట్రలు జరుగుతున్నాయని తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్పా.. మీరు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉండి ఏం జరిగిందో అని ఫోన్‌ చేయరా ? అని కవిత ప్రశ్నించారు. తాను ప్రెస్‌మీట్‌ పెడితేనే న్యాయం జరగలేదంటే.. మామూలు మహిళా కార్యకర్తకు పార్టీలో అన్యాయం జరిగితే స్పందిస్తారా అన్నారు. 103 రోజులైనా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మీరు ఎందుకు స్పందించలేదన్నారు. రేపు ఇలాంటి కుట్రలు మీపై, కేసీఆర్ పై కూడా జరగొచ్చు” అని హెచ్చరించారు.

కన్నీటి పర్యంతమైన కవిత..

అంతే కాకుండా తన ప్రాణం పోయినా కేసీఆర్‌కు అన్యాయం జరగనివ్వనని కవిత చెప్పారు. తనపై ఇన్ని కుట్రలు, ఇన్ని అవమానాలు అవసరమా? అని వాపోయారు. కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని కొందరు చూస్తున్నారన్నారు. తనను పార్టీ నుంచి బయటకు పంపడం అందులో భాగం” అని కన్నీళ్లు పెట్టుకున్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *