బాలుర ఉన్నత పాఠశాలలో “హర్ ఘర్ తిరంగా”
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పొడవైన త్రివర్ణ పతాక జెండా ఊరేగింపు
విద్యార్థులకు క్విజ్, ముగ్గులు మరియు డ్రాయింగ్ పోటీలు

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు చేపట్టిన “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరణ చేసి, సంతకాల సేకరణ లో సంతకం చేశారు. అలాగే విద్యార్థిని విద్యార్థులు 200 జెండాలతో చేపట్టిన కార్యక్రమం లో పాల్గొన్న వారిని జెండా పట్టి అభినందనలు తెలియజేశారు.
స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ వారి సౌజన్యంతో విద్యార్థినీ విద్యార్థులకు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా డ్రాయింగ్ క్విజ్ మరియు ముగ్గుల పోటీలు నిర్వహించారు. అలాగే పొడవైన త్రివర్ణ పతాక ఊరేగింపు కార్యక్రమంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొండ్లె వాసుదేవరెడ్డి అధ్యక్షతన మరియు సిసిఆర్టి డిఆర్పి (డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్) పంజా రాజమల్లు పర్యవేక్షణలో నిర్వహించారు. ముగ్గుల పోటీలు సువర్ణ లీల మరియు రజిత, క్విజ్ పోటీలు మార్కండేయ, డ్రాయింగ్ పోటీలు భాస్కరాచారి, జెండాలతో ప్రభాతభేరి కార్యక్రమం పిడి శ్రీనివాస్ నిర్వహించారు. అనంతరం పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు లక్కిరెడ్డి వీరారెడ్డి, వెంకట రమణారెడ్డి, రాజేందర్, శ్రీధర్, సుభాష్, వెంకట మల్లు తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.