“హర్ గర్ తిరంగా” ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురావేయాలి
హుస్నాబాద్ బిజెపి పట్టణ అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
ప్రధాని మోడీ పిలుపు మేరకు “హర్ గర్ తిరంగా” కార్యక్రమంలో భాగంగా మన దేశ స్వాతంత్రము కోసం పోరాడిన మహానుభావులను స్మరించుకునే కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం హుస్నాబాద్ పట్టణ బిజెపి అధ్యక్షులు & కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బిజెపి స్టేట్ కౌన్సిల్ సభ్యులు లక్కీరెడ్డి తిరుమల, బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి శంకర్ బాబు లతో కలిసి స్వాతంత్ర సమరయోధుల విగ్రహాల శుద్ధిలో భాగంగా గాంధీచౌక్ లో గల మహాత్మాగాంధీ విగ్రహంను శుద్ధిచేసి వారి విగ్రహం మరియు ఉక్కు మనిషి భారత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ & సుభాష్ చంద్రబోస్ చిత్ర పాటలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..హుస్నాబాద్ పట్టణ ప్రతిపౌరుడు భారతదేశ అమృతోత్సవాలలో భాగంగా వారి ఇంటిపైన స్వచ్చందంగా ఆగస్టు 15 వ తేది లోపు జాతీయజెండా ఎగురావేసి దేశ స్వాతంత్రము కోసం పోరాడిన మహానుభావులను గౌరవించాలని, ప్రతి బిజెపి నాయకుడు పార్టీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమలను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మహిళమోర్చా రాష్ట్ర అధికారప్రతినిధి తోట స్వరూప, పట్టణప్రధానకార్యదర్శి రాయకుంట చందు, ఉపాధ్యక్షులు భోగ మహేష్కర్, గాదాసు రాంప్రసాద్, కార్యదర్శి మల్లం ప్రశాంత్, బీజేవైఎం ప్రధానకార్యదర్శి సాయి, సీనియర్ నాయకులు అనంతస్వామి,చెన్నబోయిన రవీందర్,బోడిగే వెంకటేష్, సంతోష్ బిజెపి నాయకులు రాజేష్, గణేష్,ఆశదాపు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.