ఘనంగా పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటాం
హుస్నాబాద్ ఏసీపీ వాసాల సతీష్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమర పోలీస్ కుటుంబాలకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని హుస్నాబాద్ ఏసీపీ వాసాల సతీష్ అన్నారు. సోమవారం రోజున పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామవరంలో నక్సలైట్లు ఏర్పాటు చేసిన మందు పాతర పేలి మృతి చెందిన ఎస్ఐ జాన్ విల్సన్, సిఐ యాదగిరిలతో పాటు సిబ్బందికి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమర పోలీసులను స్మరించుకుంటూ ప్రతీ ఏటా ఈ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. హుస్నాబాద్ సిఐ కోండ్ర శ్రీనివాస్, ఎస్ఐ తోట మహేష్, జిల్లా గ్రంధాలయ చైర్మెన్ కేడం లింగమూర్తి, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితవెంకన్న, వైస్ చైర్మెన్ అయిలేని అనిత, శ్రీనివాస్ రెడ్డితో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
