లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హనుమకొండ అదనపు కలెక్టర్
సిద్దిపేట టైమ్స్ హనుమకొండ:
హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఇంచార్జీ జిల్లావిద్యాశాఖ అధికారి వెంకట్ రెడ్డి రూ.60 వేల లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీ (ఆంటీ కరప్షన్ బ్యూరో) అధికారులకు పట్టుబడ్డాడు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏసీబీ, డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో దాడి జరిగినట్లు సమాచారం. ప్రైవేట్ స్కూల్‌కి రెన్యూవల్ అనుమతి కోసం లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు రావడంతో ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో జూనియర్ అసిస్టెంట్ మనోజ్ పాత్ర కూడా ఉన్నట్లు తేలడంతో అతనిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సంబంధిత ఫైళ్లు, అనుమతుల ప్రక్రియ, అధికారుల వ్యవహారంపై అధికారులు పత్రాలు పరిశీలించారు. ఇద్దరు అధికారులను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి, మరిన్ని వివరాల కోసం విచారణ ప్రారంభించారు.





