హుస్నాబాద్ పట్టణ ప్రాంతంలో తిరుగుతున్న మతిస్థిమితం లేని వృద్ధుడిని హుస్నాబాద్ సిఐ శ్రీనివాస్ మంగళవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
మతిస్థిమితం సరిగా లేక ఓ వృద్ధుడు హుస్నాబాద్ లో సంచరిస్తున్న విషయం హుస్నాబాద్ సిఐ శ్రీనివాస్ దృష్టికి వెళ్ళగా మానవతా హృదయంతో వెంటనే స్పందించి ఏఎస్సై మల్లేశంకు వృద్ధుడి ఆచూకీ తెలుసుకోమని ఆదేశించారు. సీఐ శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఏఎస్సై మల్లేశం వృద్ధుడి ఫోటోను వాట్సప్ సోషల్ మీడియా గ్రూపులలో పంపి త్వరితగతిన వృద్ధుడి కుటుంబీకుల వివరాలు తెలుసుకున్నారు. వృద్ధుడి పేరు పల్లె శంకరయ్య (80) కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం జూపాక గ్రామానికి చెందిన వాస్తవ్యుడని తెలిసికొని వారి కుటుంబీకులను పిలిపించి వృద్ధుడిని వారికి అప్పగించారు. వృద్ధుడిని గుర్తించి కుటుంబ సభ్యులకు త్వరితగతిన అప్పగించడంలో మానవతా హృదయంతో స్పందించిన సీఐ శ్రీనివాస్ ఉదారత పట్ల పట్టణ ప్రజలు, ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.