గ్రూప్-2 & డీఎస్సీ ని వాయిదా వేయాలి: హుస్నాబాద్ నియోజకవర్గ బీఎస్పీ పార్టీ ఇంచార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్
సిద్దిపేట టైమ్స్ డెస్క్:
నిరుద్యోగ యువత కోరుతున్నట్టు గ్రూప్-2 మరియు డీఎస్సీ ని వాయిదా వేయాలని నియోజకవర్గ బీఎస్పీ పార్టీ ఇంచార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ కోరారు.
డీఎస్సీకి, గ్రూప్-2 పరీక్షలకు వ్యవధి తక్కువగా ఉన్నందుకు ప్రభుత్వం, టీజీపీఎస్సీ పునరాలోచించాలని , తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు గత పది రోజులుగా ఉస్మానియా యూనివర్సిటీలో వివిధ ప్రాంతాలలో గ్రూప్-2, డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని, పూర్తిస్థాయిలో గతంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో హామీ ఇచ్చిన విధంగా గ్రూప్-2 మరియు గ్రూప్-3 ఉద్యోగాలు పెంచాలని, మెగా డీఎస్సీ తో 25 వేల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయాలని పెద్ద ఎత్తున దీక్షలు చేస్తున్నారని అన్నారు.
గత నెల రోజుల క్రితమే టెట్ పరీక్ష నిర్వహించారు. నిరుద్యోగులు మొన్నటి వరకు గ్రూప్-1 కు సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్ మరియు DAO, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి పోటీ పరీక్షలు తక్కువ వ్యవధిలో రాశారని, ఇప్పుడు తక్కువ టైంలోనే గ్రూప్-2, డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించడం తో నిరుద్యోగులు ఒత్తిడికి గురవుతున్నారు. గ్రూప్-2, డీఎస్సీ పరీక్షకు సిలబస్ బాగా చదవ వలసి ఉంటుంది కాబట్టి నిరుద్యోగులు 90 రోజుల టైం ఇచ్చిన తర్వాత పోటీ పరీక్ష పెట్టాలని CM రేవంత్ రెడ్డిని కోరారు. 10 సంవత్సరాల తర్వాత పరీక్ష నిర్వహిస్తున్నారు కాబట్టి, నిరుద్యోగుల వయసు కూడా మీరుతుంది కాబట్టి నిరుద్యోగులు కోరినట్టు 90 రోజులు సమయం ఇచ్చి పరీక్ష నిర్వహించాలని బిఎస్పీ పార్టీ పక్షాన కోరారు.
ఈ కార్యక్రమంలో బిఎస్పీ పార్టీ హుస్నాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనగందుల శంకర్, సీనియర్ నాయకులు సుధాకర్, నియోజకవర్గ అధ్యక్షులు రాజు, శరత్ తదితరులు పాల్గొన్నారు